Monday, December 23, 2024

సమరోత్సాహంతో అఫ్గాన్.. నేడు నెదర్లాండ్స్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

లక్నో: వరుస విజయాలతో జోరుమీదున్న అఫ్గానిస్థాన్ శుక్రవారం లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో అఫ్గాన్ ఉంది. ఇం గ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి అగ్రశ్రేణి జట్ల ను అఫ్గానిస్థాన్ ఓడించింది. నెదర్లాండ్స్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి బలమైన జట్లను కంగుతినిపించింది.

ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలున్నాయి. అయితే నెదర్లాండ్స్‌తో పోల్చితే అఫ్గాన్ కాస్త బలంగా ఉందనే చెప్పాలి. పాకిస్థాన్, శ్రీలంకలను ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అఫ్గాన్ నాకౌట్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. అయితే సంచలన విజయాలకు మరో పేరుగా భావించే నెదర్లాండ్స్‌ను ఓడించడం అఫ్గాన్‌కు అంత తేలికకాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్‌లో విభాగాల్లో సమష్టిగా రాణించే జట్టుకే ఈ మ్యాచ్‌లు గెలిచే అవకాశాలుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News