Saturday, February 22, 2025

సౌతాఫ్రికా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో అఫ్గాన్ సెమీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసి అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఓమర్‌జాయ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అజ్మతుల్లా 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. వండర్ డుస్సెన్ 76 (నాటౌట్) జట్టును గెలిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News