Saturday, December 21, 2024

పాక్‌కు అఫ్గానిస్థాన్ షాక్..

- Advertisement -
- Advertisement -

షార్జా: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టి20లో అఫ్గానిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు.

ఫరూకి, ముజీబ్, నబి రెండేసి వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నబి 38 (నాటౌట్), జర్దాన్ 17(నాటౌట్) అఫ్గాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక టి20లలో పాకిస్థాన్‌పై అఫ్గాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News