Monday, December 23, 2024

సెమీస్‌లోకి అఫ్ఘాన్…… ఇంటికి ఆసీస్

- Advertisement -
- Advertisement -

కింగ్స్‌టౌన్: టి20 వరల్డ్ కప్‌లో అఫ్ఘనిస్థాన్ జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌పై అఫ్ఘాన్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆఫ్ఘనిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 116 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచింది. వర్షం కురువడంతో డిఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం బంగ్లా 19 ఓవర్లలో 114 పరుగులు చేయాల్సి ఉంది. బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఫ్ఘాన్ బౌలర్లలో నవీన్ హుల్ హక్, రషీద్ ఖాన్ చెరో నాలుగు వికెట్లు తీసి బంగ్లా నడ్డి విరిచారు. బంగ్లా దేశ్ బ్యాట్స్‌మెన్లలో లిట్టన్ దాస్ ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిగితా బ్యాట్స్‌మెన్ల నుంచి అతడికి సహకారం లేకపోవడంతో బంగ్లా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అప్ఘనిస్థాన్ గెలవడంతో నాలుగు పాయింట్లతో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. అప్ఘాన్ గెలవడంతో ఆస్ట్రేలియా జట్టు సెమీస్ నుంచి నిష్ర్కమించింది. 27న సౌతాఫ్రికాతో అఫ్ఘాన్ జట్టు తలపడనుంది. సెమీస్ లో భారత జట్టు ఇంగ్లాండ్ తో తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News