Wednesday, February 26, 2025

కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్

- Advertisement -
- Advertisement -

లాహోర్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గఢాఫీ స్టేడియం వేదికగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మంగళవారం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో ఆ రెండు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ మ్యాచ్ అటు ఇంగ్లండ్‌కు, ఇటు అఫ్గానిస్థాన్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచే టీంకే సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఓడిపోయిన జట్టు టోర్నమెంట్‌ నుంచి వైదొలగుతుంది. ఈ కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. గాయపడిన కార్సే స్థానంలో ఓవర్‌టన్‌ను జట్టులోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News