Monday, January 20, 2025

అఫ్గానిస్థాన్ బోణీ

- Advertisement -
- Advertisement -

గయానా : టి20 ప్రపంచ కప్-2024లో అఫ్గానిస్థాన్ బోణీ కొట్టింది. మంగళవారం ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. సమష్టిగా రాణించడంతో రెండు పాయింట్లు గెలిచి గ్రూప్-సీలో టాప్‌లో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (76; 45 బంతుల్లో, 4×4, 4×6), ఇబ్రహీం జద్రాన్ (70; 46 బంతుల్లో, 9×4, 1×6) భారీ అర్ధశతకాలతో రాణించారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 183 పరుగులు చేసింది. కాస్మస్ (2/25), బ్రియాన్ మసాబా (2/21) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు వచ్చిన ఉగాండ 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది.

రాబిన్సన్ (14; 25 బంతుల్లో, 1×6) టాప్ స్కోరర్ నిలిచాడు. ఫజల్లా ఫరూకీ (5/9) ఐదు వికెట్లతో విజృంభించాడు. రషీద్ ఖాన్ (2/12), నవీనుల్ హక్ (2/4) చెరో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. అఫ్ఘన్ పేసర్ ఫరూకీ ధాటికి ఉగాండ విలవిల్లాడింది. పదునైన బంతుల దాటికి ఉగాండ బ్యాటర్లు ఎవరూ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలివలేకపోయారు. 18 పరుగులకే కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో రియాజత్ (11; 34 బంతుల్లో) కలిసి రాబిన్సన్ మరో వికెట్ పడకుండా ఆడినా. వీరిద్దరి డిఫెన్స్ ఎక్కువ సేపు నిలవలేకపోయింది. ఫరూకీ మరోసారి చెలరేగి ఉగాండను కోలుకోలేని దెబ్బతీశాడు.

ఆ తర్వాత రషీద్ తన మార్క్ మ్యాజిక్‌తో మ్యాచ్‌ను తొందరగా ముగించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గానిస్థాన్ బ్యాటర్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓ దశలో 14 ఓవర్లకు 152/0తో పటిష్టస్థితిలో నిలిచింది. కానీ ఉగాండ బౌలర్లు అద్భుతం చేశారు. క్రమంగా వికెట్లు తీస్తూ అఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశారు. చివరి ఆరు ఓవర్లలో 31 పరుగులే ఇచ్చి అయిదు వికెట్లు పడగొట్టారు. నజీబుల్లా (2), మహ్మద్ నబీ (14), గుల్బాదిన్ (4), అజ్మతుల్లా (5) రాణించలేక పోయారు. ఓపెనర్లు మినహా మిగిలిన బ్యాటర్లెవరూ బౌండరీలు బాదడంతో విఫమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News