Tuesday, January 21, 2025

ఇంజినీరింగ్ ఫీజులపై మడతపేచీ

- Advertisement -
- Advertisement -

టిఎఎఫ్‌ఆర్‌సి నిర్ణయించిన ఫీజులకు
25 కాలేజీలు ససేమిరా మరోసారి
విచారణకు కమిటీ నిర్ణయం

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులపై ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టిఏఎఫ్‌ఆర్‌సి) నిర్ణయించిన ఫీజులను 25 కాలేజీలు అంగీకరించలేదు. దాంతో మరోసా రి ఆ కాలేజీల ఫీజులపై విచారణ చే పట్టాలని కమిటీ నిర్ణయించింది. టి ఏఎఫ్‌ఆర్‌సి నిర్ణయించిన ఫీజుల కం టే తమకు అధిక ఫీజులు కావాలని కోరుతున్న కాలేజీల్లో సిబిఐటి, శ్రీ నిధి, వర్థమాన్, వాసవి, నారాయణమ్మ, మల్లారెడ్డి, అనురాగ్ తదితర కాలేజీలు ఉన్నట్లు తెలిసింది. తమ కాలేజీల్లో మెరుగైన ప్రమాణాలతో ఇంజినీరింగ్ విద్యను అందించేందు కు వ్యయం ఎక్కువ అవుతుందని, త మ ఆదాయ, వ్యయాలను పునఃసమీక్షించి ఫీజులు పెంచాలని ఆయా కా లేజీల యాజమాన్యాలు కమిటీని కో రినట్లు సమాచారం. యాజమాన్యా ల విజ్ఞప్తి మేరకు ఆయా కాలేజీల ఫీ జులపై పునర్విచారణ చేయాలని టి ఏఎఫ్‌ఆర్‌సి నిర్ణయించింది.

రాష్ట్రం లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజు రూ.45 వేలుగా టిఎఎఫ్‌ఆర్‌సి నిర్ణయించింది. అయితే ఒక కాలేజీలో మాత్రం కనీస ఫీజు రూ.35 వేలుగానే నిర్ణయించారు. తమకు అధిక ఫీజు వద్దని ఆ కాలేజీ యాజమాన్యం విజ్ఞప్తి మేరకే కనీస ఫీజు రూ.35 వేలుగా కమిటీ ఖరారు చేసింది. కనీస ఫీజు రూ.35 వేలు ఉండగా దానిని రూ.45 వేలుగా కమిటీ ఖరారు చేసింది. కనీస ఫీజు ఉన్న కళాశాలలు కూడా పరిమితంగానే ఉన్నాయి. అత్యధికంగా ఎంజిఐటికి గత జులైలో రూ.1.60 లక్షల ఫీజునే టిఎఎఫ్‌ఆర్‌సి నిర్ణయించింది. 25 ఇంజినీరింగ్ కాలేజీలకు రూ. లక్షకు పైగా ఫీజులు ఖరారయ్యాయి. చాలా కాలేజీలకు ఫీజులను తగ్గించగా.. కొన్ని కాలేజీల ఫీజులను యథాతధంగా ఉంచారు.

గత జనవరిలో ప్రారంభమైన ప్రక్రియ

రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) మూడేళ్లకోసారి సవరిస్తుంది. గత మూడేళ్ల క్రితం అమలు చేసిన ఫీజుల కాలపరిమితి 2021 22 విద్యాసంవత్సరంతో ముగిసింది. ఈ నేపథ్య ంలో 2022- 23 నుంచి 2024 – 25 వరకు అమ లు కానున్న వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారుకు టిఎఎఫ్‌ఆర్‌సి గత జనవరిలో షెడ్యూల్ విడుదల చేసి, కళాశాలల ఆదాయ వ్యయాల నివేదికలను పరిశీలించడంతోపాటు యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది. ఆ సందర్భంలో కళాశాలల యాజమాన్యాలు అంగీకరించిన ఫీజులను టిఏఎఫ్‌ఆర్‌సి రిజిస్టర్‌లో నమోదు చేసింది. అయితే కరోనా పరిస్థితులు, ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించిన టిఎఎఫ్‌ఆర్‌సి ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించింది.

ప్రభుత్వం దానిపై తుది నిర్ణయం తీసుకోకముందే.. గత నెల 21 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. టిఎఎఫ్‌ఆర్‌సి ఎదుట తాము అంగీకరించిన ఫీజుల వసూలు అనుమతించాలని కోరాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం.. మరోవైపు కౌన్సెలింగ్ ప్రారంభమైనందున.. ప్రవేశాల్లో ఆలస్యం జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. టిఎఎఫ్‌ఆర్‌సి వద్ద అంగీకరించిన ఫీజులను వసూలు చేసేందుకు కాలేజీలకు అనుమతినిచ్చింది. అయితే వసూలు చేసిన ఫీజులు పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడి ఉండాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పాత ఫీజులకు, కొత్త వాటికి మధ్య పెరిగిన సొమ్మును కాలేజీల బ్యాంకు ఖాతాల్లోనే ఉంచాలని.. ఒకవేళ తుది తీర్పు కళాశాలలకు వ్యతిరేకంగా వస్తే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని హైకోర్టు తెలిపింది.

ఈ నేపథ్యంలో టిఎఎఫ్‌ఆర్‌సి మరోసారి విచారణ చేపట్టింది. ఫీజుల ఖరారు ప్రక్రియ గత జనవరిలో ప్రారంభం కాగా, పలు పరిణామాల నేపథ్యంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎంసెట్ కౌన్సెలింగ్ భాగంగా ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలోనే రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పటివరకు ఫీజులపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News