Wednesday, January 22, 2025

ఆఫ్రికా నుంచి వచ్చిన మరో చీతా మృతి..

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ అభయారణ్యంలో ఆదివారం ఓ చీతా మృతి చెందింది. ఆఫ్రికా నుంచి ఇక్కడికి రప్పించిన 12 ఈ చిరుత పులుల రకం ప్రాణులలో ఈ ఉదయ్ అనే ఆరు సంవత్సరాల చీతా అస్వస్థతకు గురై మృతి చెందిందని అధికారులు తెలిపారు. నెలరోజుల వ్యవధిలో ఈ విధంగా రెండవ చీతా మృతి చెందడంతో కలవరం చెలరేగింది. ఫిబ్రవరిలోనే ఆఫ్రికా నుంచి 12 చీతాలను ఇక్కడి నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చారు. రోజువారి పరీక్షల క్రమంలో ఈ ఉదయ్ అనే చీతా నిస్సత్తువుగా ఉండటం గమనించారు. వెంటనే అటవీశాఖ ఇచ్చిన సమాచారం మేరకు దీనికి ప్రాధమిక చికిత్స జరిపి, వేరే చోటికి తరలించారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం నాలుగు తరువాత మృతి చెందిందని గుర్తించారు. మృతికి కారణాలు పోస్టు మార్టం నివేదిక తరువాత తెలుస్తాయని అటవీశాఖాధికారి ఒక్కరు తెలిపారు.

Also Read: న్యాయం జరిగే వరకూ పోరాటం.. జంతర్‌మంతర్ వద్ద మళ్లీ రెజ్లర్ల ఆందోళన

ఆఫ్రికా నుంచి మొత్తం 20 చీతాలను ఖండాంతర తరలింపు ప్రాజెక్టులో భాగంగా దశలవారిగా తీసుకువచ్చారు. భారతదేశంలో ఈ పెద్ద చిరుతల ప్రాణిని నిలబెట్టాలనే ఆలోచనతో ఈ విధంగా వీటిని తరలించినా, ఇవి ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు మరో చీతా మరణంతో తలెత్తుతున్నాయి. నెలరోజులు క్రితమే ఐదేళ్ల సషా అనే చీతా కిడ్నీ సంబంధిత జబ్బుతో మృతి చెందింది. ఈ ఆడ చిరుతను ఆఫ్రికా నుంచి కునో నేషనల్ పార్క్‌కు మొదటి దఫాగా తీసుకువచ్చిన చీతాలలో భాగంగా చేర్చారు.

నమీబియా నుంచి గత ఏడాది వచ్చిన ఐదు ఆడ చీతాలలో ఇది ఒక్కటిగా ఉంది, నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చిరుతలను ప్రధాని మోడీ తన పుట్టినరోజు దశలో గత ఏడాది నేషనల్ పార్క్‌లోకి విడిచిపెట్టారు. భారతదేశంలో 1952లోనే చిరుతల జాతి అంతరించిపోయిందని అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు చీతాలను ఆఫ్రికాను ఇక్కడికి తీసుకువచ్చి నిర్ణీత ప్రాంతాలకు తరలించాలని, జాగ్రత్తగా చూసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News