Saturday, December 21, 2024

కునో పార్కులో మరో చీతా మృతి..

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. ప్రాజెక్టు చీతాలో భాగంగా దక్షిణాఫ్రికానుంచి తీసుకువచ్చిన వాటిలో ఒకటైన ఆడ చీతా దక్ష మంగళవారం మృతిచెందింది. పార్కులో ఇతర చీతాలతో జరిగిన ఘర్షణలో దక్ష మరణించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాగా కునోలో చీతా మరణించడం గత నలభై రోజుల్లో ఇది మూడోఘటన కావడం గమనార్హం. నమీబియానుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటైన సాశా అనే ఆడచీతా ఈ ఏడాది మార్చి 27న మృతి చెందింది.

భారత్‌కు రాకముందునుంచే మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న అది ఇక్కడికి వచ్చాక మరింత అనారోగ్యానికి గురయి చనిపోయింది. అలాగే దక్షిణాఫ్రికానుంచి తీసుకున్న చీతాల్లో ఒకటైన ఉదయ్ అనే మగ చీతా ఏప్రిల్ 23 అనారోగ్యానికి గురయి చనిపోయింది. దక్షను జతకట్టడం(మేటింగ్) కోసం బోమా7 (ఎన్‌క్లోజర్)నుంచి వదిలిపెట్టారని, అయితే మగచీతాలు ఈ సమయంలో రెచ్చిపోయి దాడికి దిగాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అలాంటి సమయంలో జోక్యం చేసుకోవడం చాలా కష్టమని కూడా వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News