Wednesday, January 22, 2025

స్మగ్లర్ పొట్టలో 43 హెరాయిన్ క్యాప్సూల్స్: వెలికితీసిన డిఆర్‌ఐ అధికారులు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: దేశంలోకి స్మగ్లింగ్ చేసిన హెరాయిన్‌ను ఒక ఆఫ్రికా జాతీయుడి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) అధికారులు కక్కించారు. దాదాపు రూ. 5 కోట్ల విలువైన 43 హెరాయిన్‌ను దాచిన క్యాప్సూల్స్‌ను ఆ వ్యక్తి నుంచి అధికారులు కక్కించారు.

జూన్ 21వ తేదీన బెనిన్ నుంచి ముంబైలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఒక నల్ల జాతీయుడిని డిఆర్‌ఐ అధికారులు సోదా చేశారు. అతను మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు కచ్ఛితమైన సమాచారం అందడంతో అధికారులు ఆతడిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అతని బ్యాగేజ్‌లో ఏమీ దొరకనప్పటికీ అతను తన శరీరంలో వాటిని దాచి ఉంటాడని అధికారులు అనుమానించి అతడిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కడుపులో క్యాప్సూల్స్ ఉన్నట్లు తేలింది.

అతడిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెజె ఆసుపత్రిలో చేర్పించి జూన్ 21 నుంచి జూన్ 30 వరకు మొత్తం 43 క్యాప్సూల్స్‌ను అతడి శరీరంలోనుంచి వెలికితీశారు. ఆ క్యాప్సూల్స్‌లో 504 గ్రాముల హెరాయిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరచగా అతడికి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News