Monday, December 23, 2024

నోటితోనే బుల్లెట్ పట్టుకున్నాడు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకసారి తుపాకి నుంచి బుల్లెట్ బయటికి వస్తే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అలాంటిది ఓ సైనికుడు తుపాకి నుంచి బయటకు వచ్చిన బుల్లెట్ ను నోటితో ఆపి అందరిని ఆశ్యర్యపరిచాడు. ఈ ఘటన ఆఫ్రికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా సైనికుడి దుస్తువుల్లో ఉన్న ఒక వ్యక్తి రైఫిల్ తో తన నోటికి దగ్గరగా కాల్పులు జరుపుతున్నాడు. ఇక కొన్ని సెకండ్ల తర్వాత ఆ వ్యక్తి బుల్లెట్ షెల్ ను తన నోటిలో నుంచి ఉమ్మి వేస్తున్నాడు.

ఇలా రెండు మూడు రకాల తుపాకులతో కాల్చుకుని బుల్లెట్ షెల్ ను ఎంతో ఈజీగా నోటితో పట్టి బయటికి ఉమ్మేసాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో అతను నిజంగా మనిషేనా లేకపోతే ఇంకేమైనానా అనేది అర్థం కాక నెటిజన్స్ సైతం కన్ఫ్యూషన్ లో మునిగిపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News