Monday, December 23, 2024

అద్భుతాలు చేయాలంటే సిఎం కెసిఆర్ తరువాతే ఎవరైనా : గాంధీ

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి: కొట్లాడి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది ఏండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించి వందేళ్ల ప్రగతిని సాధించందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కాజాగూడ చెరువు వద్ద నిర్వహించిన తెలంగాణ 2కె రన్ కార్యక్రమంలో రాయదుర్గం సిఐ మహేష్‌తో కలిసి సోమవారం జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇది ప్రజలకు ఆరోగ్యం శారీరక వ్యాయామానికి ఎంతగానో తోడ్పడుతుందని అ న్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్ట్రం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎంతగానో ప్రగతని సాధించిందని, సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే తెలంగా ణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందని పేర్కొన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళుతూ బంగారు తెలంగాణ దిశగా సాగుతుందని, ఆనాటి అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ రోజు బంగారు తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు.

రైతు బందు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్, కల్యాణ లక్ష్మి/షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, అమ్మబడి, హాస్టల్ విద్యార్థులకు సన్న రకం బియ్యం, గురుకుల పాఠశాలల ద్వారా అల్పసంఖ్యల వర్గాలకు ఉచిత విద్య, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, ఓవర్సీస్ స్కాలర్ షిప్ అల్ప సంఖ్యాల వర్గాలకు ఉపకార వేతనాలు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బం గారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మాదాపూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News