లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
అసైన్డ్ భూముల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం
కాంగ్రెస్ అనవసర దుష్ప్రచారం
నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/నర్సాపూర్/ఆదిలాబాద్‌ప్రతినిధి/బోథ్/నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే అసైన్డ్ భూములను అనుభవిస్తున్న లబ్ధిదారులందరికీ పట్టాలిస్తామని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని గురువారం నర్సాపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కెసిఆర్ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్, నర్సాపూర్‌లలో గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కాంగ్రెస్, బిజెపిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూనే బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన త ర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగం ముఖచిత్రాన్నే మార్చివేసిన విధానాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతల మోసపూరిత మాటలు, అబద్ధాలను నమ్మ వద్దని ప్రజలను కోరారు. ధరణి పోర్టల్‌ను తీసేసి బంగాళాఖాతంలో కలపాల ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారని, ధరణి పోర్టల్‌తో ప్రభుత్వం తనకున్న అధికారాన్ని ప్రజల బొటనవేలుకు ఇ చ్చిందని కెసిఆర్ అన్నారు.
ధరణిని తీసేస్తే రైతు బంధు నిధులు, రైతు బీమా, పంట కొనుగోలు డబ్బులు ఎలా వస్తాయ్? అని ప్రశ్నిస్తూనే ధరణిని తీసేస్తే మళ్లీ వీఆర్వోలు, ఎమ్మార్వోల ఆఫీసుల చు ట్టూ తిరగాల్నా..? అని కాంగ్రెస్ పార్టీ నాయకు లను నిలదీయాలని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రజలను కోరారు. ధరణిని తీసేస్తే మళ్లా దళారుల రాజ్యం, భూకబ్జాలు, పైరవీకారులు, పాత రిజి స్ట్రేషన్ పద్ధతి, పడిగాపులు పడటం వంటి అష్టకష్టాలు మొదలవుతాయని అన్నారు. కర్నాటక నుంచి వచ్చిన ఒక నాయకుడు తమ రాష్ట్రంలో వ్యవసా యానికి 5 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు. తెలంగాణలో 24 గంటల పాటు కరెంటు ఇ స్తున్నామని ఆయన చెప్పారని స్పష్టం చేశారు. మరి ఏది కావాలి? అని వేదికపై నుంచి ప్రజలను అడగ్గా 24 గంటలే కావాలని జనం కేకలు వేశారు. కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఎన్నికలు రాగానే ఆగం కాకుండా మంచీ చెడూ ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణను 58 ఏళ్లపాటు అరిగోసపెట్టి కరువుల పాల్జేసి, అష్టకష్టాలు పెట్టిందని, మళ్లీ ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని, జాగరూకత వహించాలని సిఎం కెసిఆర్ కోరారు. 1969లో మా తెలంగాణ మాగ్గావాలే అని కొట్లాడితే కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపిందని, లక్షలాది మంది జైళ్లల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారని గుర్తు చేశారు. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో మనతో (బిఆర్‌ఎస్) పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి మళ్లీ మోసం చేశా రని, 2005లోనో, 2006లోనో తెలంగాణను ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ధోఖా చేసిందని ధ్వజమెత్తారు. కెసిఆర్ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో… అని దిగొ చ్చిందని, అప్పుడు కూడా సక్కగా ఇయ్యలేదని అన్నారు. ఉద్యోగులు సకల జనుల సమ్మె, అనేక మంది పిల్లలు చనిపోతే, 33 పార్టీలు మద్దతిచ్చిన తర్వాత ముందుకొచ్చారని అన్నారు. తెలంగాణల బిఆర్‌ఎస్‌పార్టీ అధికారంలోకి వచ్చి నపుపడు సరిగ్గా కరెంటు లేదని, మంచినీళ్లు లేవని, రైతులు చేనే త కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు పోవడం వంటి దుర్భర పరిస్థితులుం డేవని, కానీ బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ కొద్దికాలంలోనే ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు.
సమాజంలో కొందరు విధివంచితులైతే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వా నిదేనని, పెన్షన్ దారులు ఎవరిపైనా ఆధారపడి ఉండకుండా చూడాలని వందల్ల ఉన్న పెన్షన్‌ను వేలల్లోకి తీసుకుపోయింది బిఆర్‌ఎస్ ప్రభుత్వ మేనని చెప్పారు. అంతేగాక రైతులకు సాయం చేయాలని ఏ ప్రభుత్వం, ఏ నాయకుడూ ఆలోచన చేయలేదని, నీటి తీరువా బకాయిలను మాఫీ చేసి, దానిని పూర్తిగా రద్దు చేశామన్నారు. దేశంలో రైతుబంధు పథకాన్ని పుట్టిం చిందే కెసిఆర్, బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని సగర్వంగా చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నర కాలం వ్యవధిలోనే దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా వ్యవసా యానికి ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నామని, అంజుమన్ అప్పులు కట్టకుంటే రైతుల తలుపులు పీక్కొని పోయిండ్రే తప్ప కాంగ్రెస్ ఏనాడూ రైతు లకు సాయంలేద ని గుర్తుచేశారు. ఇప్పుడు రైతులు పండించిన ధా న్యాన్ని ప్రభుత్వమే కొంటోందని, దురదృష్టవ శాత్తూ రైతు చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడొద్దని 5 లక్షల రూపాయలను రైతు బీమాగా అందిస్తున్నామని వివరించారు. రైతుబంధు ఉం డాలన్నా, అది 16 వేల రూపాయలకు పెరగాల న్నా ఈనెల 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు, బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులకు ఓట్లేసి గెలిపించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను కోరారు.
ఆదిలాబాద్‌లో జన ప్రభంజనం
ఆదిలాబాద్‌ః చావునోట్లే తలపెట్టి, కోట్లాడి సాధిం చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ వంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని, పేదల సంక్షే మం, వ్యవసాయ అహర్నిశలు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎదురైన సమస్యలను అధిగమి స్తూ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోం దన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న కాంగ్రెస్, తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశా ల కూడా ఇవ్వని బిజెపి పార్టీలకు ఎన్నికల్లో బుద్ది చెప్పి బిఆర్‌ఎస్ అభ్యర్థి , ఎమ్మెల్యే జోగు రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని డైట్ మైదానంలో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన ఆశేష జనవాహిని తో సభా ప్రాంగణం నిండి పోగా ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసం గించారు. ఊరు వాడ నుండి భారీ ఎత్తున తరలి వచ్చిన జనం చప్పట్ల నడుమ ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది. కనుచూపు మేర జన ప్రభంజనం జై తెలంగాణ జై కెసిఆర్ నినాదాలతో హోరెత్తించడంతో ఆ ప్రాంగణమంతా మారు మోగిపోయింది.
ఐదేళ్ల తలరాతను రాసే ఓటును వేసే ముందు అభ్యర్థితో పాటు అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్ర గురించి తెలుసుకోవాలన్నారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ సాధించేందుకని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని చావు నోట్లో తలకా య పెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసినట్లు వివరించారు. రైతుల సంక్షేమమే పరమావదిగా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు చేశామన్నారు. యాబై ఏళ్లుగా సాధ్యం కానీ చనక కొరట బ్యారేజ్ పనులు తుదిదశకు చేరు కున్నా యని త్వరలోనే యాబై వేల ఎరాలకు సాగునీరు అందుతుందన్నారు. గతంతో కాంగ్రెస్ హయంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల న్నీంటినీ పరిష్కరించా మన్నారు. మైనార్టీలను ఓటు బ్యాంక్‌గా వాడుకొని వదిలేసారని, మైనార్టీల సంక్షేమానికి పన్నెండు వేల కోట్ల రూపాయిలను ఖర్చు చేసిన ఘనత బిఆర్ ఎస్ ప్రభుత్వనిదేన న్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సిలు మధుసుద నా చారి, దండె విఠల్, జడ్‌పి చైర్మన్ జనార్దన్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారీ, డిసి సిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, పట్టణ అధ్యక్షులు అజయ్ , సయ్యద్ సాజిదొద్దిన్, యూనుస్‌అక్బని, స్వరూప, మమత పర్వీస్ ఉన్నారు.
కాంగ్రెస్, బిజెపిని నమ్మి మోసపోకండి
రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలను నమ్మి మో సపోవద్దని ఇచ్చోడ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించా రు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మంచి చెడులను తెలుసుకొని ఓటు వేయాలని ప్రజలకు హితవు పలికారు. పార్టీల చరిత్ర తెలు సుకొని ప్ర జలను పట్టించుకున్నా నాయకుడినే గెలిపించాలన్నారు. ఓటు ఆయుధంతో ఈ నెల 30వ తేదిన ప్రతీ ఒకరు జాగ్రత్తగా పరిశీలించి ఎన్నుకో వాలన్నారు. తెలంగాణ కోసమే బిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందని 15ఏళ్ల పోరాట ఫలితమే తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు. బోథ్ నియోజకవర్గంలో 80 చెరువుల పూడిక తీతలు చేశామన్నారు. అలాగే జిల్లాలో శనక, కొరట, పిప్పల్ కోటి తదితర ప్రాజెక్ట్‌లను నిర్మించి రైతులకు లక్ష ఎకరాలకు నీరు అందించామన్నారు. 50 ఏళ్ల నుండి పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అరిగోస పెట్టింద న్నారు. ఎజెన్సీ ప్రాంతాల్లో అంటు రోగా లతో ప్రజలు బాధ పడుతుండేవారని, ఇప్పుడు ఎక్కడ కూడా అంటు రోగాలు, మలేరియా, టైపాడ్ జ్వరాలు లేవన్నా రు. గతంలో నీటికి ఎంతో కటకట ఉండేదని, ఇప్పుడు మిషన్ భగీరథతో ప్రతీ గ్రామానికి మంచినీళ్లు ఇస్తున్నామన్నారు. ఎక్కడ కూడా కమీషన్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురించి మాట్లాడుతూ రైతులకు మూడు గంట లే కరెంట్ అని పేర్కొనడం ఎంతవరకు సమంజసం అన్నారు. గిరిజనే తరులకు పోడు భూముల పట్టాలు ఇప్పిం చేందుకు తమ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సైతం సిద్ధమవుతుందన్నారు. కేంద్రం మనకు నవోదయ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఇవ్వకుంటే ఇక్కడ ఉన్న బిజెపి ఎంపి ఏం గడ్డి పీకుతున్నారా అని అన్నారు. కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణం తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్థి చేస్తామన్నారు. బోథ్ నియోజక వర్గంలో ముస్లిం, మైనార్టీలకు, దళితులకు, గిరిజనులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 2 వేల ఫెన్షన్ నుంచి 5 వేల ఫెన్షన్ వరకు చేయనున్నటు తెలిపారు. రైతుబంధు రూ. 10 వేల నుండి రూ. 16 వేల వరకు రైతులకు ఇవ్వనున్నట్లు తెలి పారు. బోథ్ అభ్యర్థిగా జాదవ్ అనిల్‌కు ఓటు వేసి గెలిపించాలని, ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థిని జోగు రామ న్నను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంఎల్‌ఎ జోగు రామ న్న, మాజీ ఎంపి జి.నగేశ్, బోథ్ అభ్యర్థి జాదవ్ అనిల్, ఎంపిపి తుల శ్రీనివాస్‌తో పాటు, జెడ్పి టిసిలు, ఎంపిపిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెన్షన్లను రూ.5 వేలకు పెంచుతాం : కెసిఆర్
డిచ్‌పల్లి: ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్ధులు, వారు వెనుకవున్న పార్టీల గత చరిత్ర కూడా చూడాలని, వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల ఆ వైఖ రి ఎలా ఉండెనో కూడా చూడాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కెసిఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, మీ కండ్ల ముందటనే పుట్టిందని అన్నా రు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటది…, గ్రామం బాగుంటేనే దేశం బాగుంటది అనే ఉద్దే శ్యంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరణ చేసినమని అ న్నారు. సంక్షేమాన్ని మొదలుపెడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా 40 రూపాయ లు, 70 రూ., 200రూ., ఉన్న పెన్షన్లను వెయ్యి రూపాయలకు పైగా చేసినమ ని చెప్పారు. పేదోళ్ళ దగ్గర కొసరొద్దని రాష్ట్ర ప్రభుత్వ సంపద పెరిగిన కొద్దీ వెయ్యి రూపాయల పెన్షన్‌ను ఎవ్వరూ అడగకున్నా రెండు వేలకు పెంచినం అని, మళ్ళీ అయిదు వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. పరిశ్రమలకు మంచి పాలసీలు తెచ్చి పెట్టుబడులు సమకూర్చు కు న్నామని, ఐటి రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు. రాష్ట్రం బాగుపడిందని తెలుసుకునే గీటురాళ్ళల్లో తలసరి ఆదా యం, తలసరి విద్యుత్తు వినియోగం అని, ఇవ్వాల బిఆర్‌ఎస్ పాలనలో తెలం గాణ రాష్ట్ర తలసరి ఆదాయం 3.18 లక్షల రూపాయలుగా ఉందని, ఇది దేశంలోనే నెంబర్ వన్ అని వివరించారు. కృష్ణా, గోదావరి రెండు నదుల మధ్య ఉన్నా కెసిఆర్ వచ్చే వరకూ ఇప్పటి వరకూ ఎవ్వరికీ మంచినీళ్ళ సమ స్యను పరిష్కరించే సత్తా లేకుండా పోయిందని, గీ మాత్రం ఎవ్వరూ ఎందుకు ఆలోచించలేదని అన్నారు. కెసిఆర్ కిట్ పథకంతో అమ్మవొడి వాహనాలతో ఆడబిడ్డలను తీసుకొచ్చి ప్రసవం చేసి, ఆడపిల్ల అయితే 13 వేలు, మగ పిల్లవా డు అయితే 12 వేలు, కిట్ ఇచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపుతున్నామని చెప్పా రు. గంతలో హాస్పిటల్‌కు ప్రసవానికి వెళితే డబ్బులు కట్టేదని, ఇవ్వాల బిఆర్ ఎస్ ప్రభుత్వంలో ఉల్టా డబ్బులు ఇస్తున్నామని, ఇలా గతంలో ఎవ్వరన్నా చేసిండ్రా ఇట్లా… అని ప్రజలను అడిగారు. బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం రిలీఫ్ ఫండ్‌ను కొన్ని వేల మందికి ఇప్పించిండని అన్నారు. ప్రభుత్వమే వైద్య బృం దాలు పంపి మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల కండ్లద్దాలు బిఆర్‌ఎస్ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లాంటివి ప్రజల బాధలను తగ్గించాలని చేసినమని, ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని మానవీయ కోణంలో ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. మంచి పథకాలు ఉండాల్నా..? లేక పదేండ్లు పడ్డ శ్రమ వృధా కావాల్నా..? మళ్ళీ వెనక్కి పోవాల్నా.? అనేది ప్రజలందరూ జాగ్రత్తగా ఆలోచించాలని కెసిఆర్ కోరారు. డిచ్‌పల్లిలో లంబాడ బిడ్డలు ఎక్కువని, ఇక్కడ మా తాండాలో మా రాజ్యం కావాలని ఎన్నో ధర్నాలు చేసిండ్రు.. బిఆర్‌ఎస్ ప్రభుత్వమే గ్రామ పంచాయితీలుగా చేసిందని అన్నారు. మిగిలిన గిరిజనులకూ పోడు పట్టాలను అందిస్తామని, గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతం పెంచుకుంటే వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగినయి… గిరిజనుల కోరికలను, అభివృద్ధి పనులను ఎవ్వరూ తీర్చలేదని, ఒక్క బిఆర్‌ఎస్ ప్రభుత్వమే తీర్చిందని సీఎం కెసిఆర్ సగర్వంగా చెప్పారు. మంచిప్ప రిజర్వాయర్ త్వరలోనే పూర్తవుతుందని, ఇజ్రాయేల్ టెక్నాలజీతోని 3 ఎకరా లకు ఒక ఔట్‌లెట్ పెట్టి నీళ్ళు అందిస్తామన్నారు. రిజర్వాయర్ బాధి తులకు మంచి నష్టపరిహారం ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.
బీడీ కార్మికులకు ఏ ప్రభుత్వం ఏంచేయలేదని, 16రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నప్పటికీ ఒక్క తె లంగాణ రాష్ట్రంలోనే కార్మికులకు, ప్యాకర్లకు, టేకేదార్లకు పెన్షన్ ఇస్తున్నా మని చెప్పారు. “నేను చిన్నప్పుడు బీడీ కార్మికుల ఇంట్లో చదువుకు న్నా కాబట్టి వాళ్ళ బాధలు నాకు తెలుసు” అని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. కొత్తగా పేర్లను నమోదు చేసుకునే బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. 103 డయాలసిస్ కేంద్రాలను పెట్టుకున్నామని, వాళ్ళకూ రూ. 2 వేల పెన్షన్‌ను ఇస్తున్నామని, దాన్ని 5 వేలకు పెంచుతామన్నారు. గల్ఫ్ కు టుంబాలతో పాటుగా ప్రతి ఒక్కరికీ బీమా చేయిస్తామని చెప్పారు. కరెంటు, ధరణి తీసేస్తామని కాంగ్రెసోల్లు బహిరంగంగానే చెబుతున్నారని, వాళ్ళ మాటలు నమ్మి మోసపోతే ఎవ్వరూ ఏం చేయలేరని సీఎం కెసిఆర్ అన్నారు.