Monday, December 23, 2024

నాలుగేళ్ల తర్వాత డిప్యూటీ కలెక్టర్ వి.లచ్చిరెడ్డికి కీలక బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత డిప్యూటీ కలెక్టర్ వి.లచ్చిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. సిసిఎల్‌ఏలో సిఎంఆర్‌ఓ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆయన్ను నియమిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ పని చేస్తోన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డిని రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా నవీన్‌మిట్టల్ ఆదేశించారు.

ఈ నేపథ్యంలోనే 1992 బ్యాచ్‌కు చెందిన లచ్చిరెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించినట్టయ్యింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందు సిఎం రేవంత్ రెడ్డి వెంట లచ్చిరెడ్డి ఉన్నారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయనకు అప్పగించిన బాధ్యతల నేపథ్యంలో రికార్డుల డిజిటలైజేషన్, భూమాత వెబ్ పోర్టల్ రూపకల్పనకు అవసరమైన చర్యల్లో లచ్చిరెడ్డి భాగస్వామి కానున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News