Monday, December 23, 2024

తెలంగాణ ఏర్పడ్డాక చేపల ఉత్పత్తి గణనీయం: కలెక్టర్ రాజర్షి షా

- Advertisement -
- Advertisement -

మెదక్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించకముందు చేపలను ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకునే వారమని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత మత్స అభివృద్ధి పథకం కింద వందశాతం సబ్సిడీ ఇవ్వడం వల్లచేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, నేడు చేపలను ఎగుమతే చేసే స్తాయికి మన రాష్ట్రం ఎదిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా గురువారం మెదక్ కలెక్టరేట్ ఆవరణలో మత్సశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేష్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలలో నేడు ఊరూరా చెరువుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను బాగు చేసుకోగా, కాళేశ్వరం జలాలతో వాటిని నింపుకోవడం వల్ల రాష్ట్రంలో చేపల పెంపకానికి అవకాశాలు పెరిగాయన్నారు. ప్రభుత్వం ఉచితంగా చేప విత్తనం సరఫరా చేయడం వల్ల మత్స సహకార సంఘాలు పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపట్టారని తద్వారా మత్స సంపద బాగా పెరిగిందని, ఆర్థికంగా బలోపేతమవుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త మత్స సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో గతంలో 206 సంఘాలుఉండగా ఇప్పుడు 273 సంఘాలకు ఏర్పడి 17,500 సభ్యులున్నారని అన్నారు. సమీకృత మత్స పథకం కింద మత్ససహకార సంఘాలకు వలలు, ఆటోలు, టూవీలర్లు వంటి ఉపకరణాలు అందించామన్నారు. రాష్ట్ర పశుసంవర్దక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు కొంటూర్ చెరుఉవ వద్ద సైంటిఫిక్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దానికి సంబందించిన ప్రతిపాదనలు కూడా పంపుతామని కలెక్టర్ అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భరత నాట్యం కార్యక్రమాన్ని తిలకించారు.

ఈ సందర్భంగా మత్స, పాడిపరిశ్రమ, పశుసంవర్దక శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అదనపు కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. అంతకుముందు డిజిటల్ స్క్రీన్‌పై మత్స ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మత్స శాఖ సహాయ సంచాలకులు రజిని, పాడిపరిశ్రమ అధికారి శ్రీనివాస్, పశుసంవర్దక శాఖాధికారి విజయశేఖర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మత్స సహకార సంఘం డైరెక్టర్ రాజయ్య, డిఎస్‌డిఓ విజయలక్ష్మి,మత్స సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News