Wednesday, January 22, 2025

టి20 లకు గుడ్ బై చెప్పిన విరాట్, రోహిత్

- Advertisement -
- Advertisement -

ముంబై: భారతీయ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ గెలిచాక పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను కూడా టి20 ల నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపారు. దీనికి ముందు విరాట్ కోహ్లీ సైతం టి20 మ్యాచ్ ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

‘‘ఇది నా చివరి గేమ్. నేను టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నాను. నేను ప్రతి క్షణాన్ని ఆనందించాను. నేను క్రికెట్ కెరీర్ ను ఇదే టి20 ఫార్మాట్ తో మొదలెట్టాను. ప్రపంచ కప్ గెలవాలని నేను కలలు కన్నాను. దానిని సాధించాను’’ అన్నారు.

ప్రపంచ కప్ సాధించిన ఇండియా జట్టు కెప్టెన్లలో రోహిత్ శర్మ మూడో వాడు. ఇదివరలో కపిల్ దేవ్(1983), ఎంఎస్. ధోనీ (2011)లో ఈ కప్ సాధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News