Monday, November 25, 2024

సీఎన్‌జీ ర్యాలీని నిర్వహించిన ఏజి అండ్‌ పి ప్రథమ్‌

- Advertisement -
- Advertisement -

కడప: భారతీయ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) పరిశ్రమలో అగ్రగామి సంస్ధ, ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని కడపలో ‘గ్రీన్‌ వీల్స్‌ సీఎన్‌జీ ర్యాలీ’ని నిర్వహించింది. గ్యాస్‌ ఆధారిత ఆర్ధికవ్యవస్థ దిశగా మళ్లాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా క్షేత్ర స్ధాయిలో కూడా చురుగ్గా పనిచేస్తూ, సీఎన్‌జీ యొక్క ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో ఈ ప్రచారాన్ని నిర్వహించారు. గ్రీన్‌ వీల్స్‌ ఆన్‌ సీఎన్‌జీ ర్యాలీ రాజీవ్‌ పార్క్‌ రోడ్‌, ఎర్రముక్కపల్లి సర్కిల్‌ వద్ద ప్రారంభమై నూతన బస్టాండ్‌ సర్కిల్‌ వరకూ 5 కిలోమీటర్ల మేర జరిగింది. ఈ ర్యాలీ కోటిరెడ్డి సర్కిల్‌ మీదుగా వెళ్లిఅక్కడ నుంచి ఆర్‌టీసీ బస్టాండ్‌ మీదుగా హరిత హోటల్‌ కు సాగింది. ఈ డ్రైవ్‌ను ఈ ప్రాంతంలో సుప్రసిద్ధ ఓఈఎం డీలర్‌షిప్స్‌ అయినటువంటి హరున్‌ బజాజ్‌, పియాజ్జియో వంటి వాటి సహకారంతో నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని విభాగాల సీఎన్‌జీ వాహనాలైనటువంటి ఆటోలు, కార్లు, చిన్న మరియు కమర్షియల్‌ వాహనాలు కూడా పాల్గొనడంతో పాటుగా సీఎన్‌జీ మరియు దీని ప్రయోజనాలు గురించి అవగాహన విస్తరించారు.

సీఎన్‌జీకి ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ ‘మెగా సీఎన్‌జీ ఎక్సేంజ్‌ మేళా’ను నిర్వహించింది. దీనిద్వారా కడప జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ఆటోలను సీఎన్‌జీ ఆటోలుగా అతి తక్కువ ధరలో మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ ఎక్సేంజ్‌ మేళా, ఆటో డ్రైవర్ల మదిలో ప్రత్యేక స్ధానం పొందింది. సీఎన్‌జీగా తమ ఆటోలను మార్చుకోవడం ద్వారా ప్రతి నెలా దాదాపు 10వేల రూపాయల వరకూ వారు ప్రయోజనం పొందగలరు. ఈ మేళాలో భాగంగా ఆటో డ్రైవర్లకు 15వేల రూపాయల విలువైన ప్రయోజనాలను ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ అందించింది.

ఈ సందర్భంగా ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ రీజనల్‌ హెడ్‌ శ్రీ జీఏ వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘అందరికీ అందుబాటులో ఉండే కంప్రెస్ట్‌ నేచురల్‌ గ్యాస్‌ను అందించాలనే ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ యొక్క దృష్టిని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఈ ర్యాలీ ఓ ప్రగతిశీల ముందడుగు. కడపలో, ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ ప్రస్తుతం 800 కేజీల నేచురల్‌ గ్యాస్‌ను ప్రతి రోజూ కడప, వేంపల్లి మరియు పులివెందులలో ఉన్న మూడు సీఎన్‌జీ స్టేషన్స్‌ ద్వారా పంపిణీ చేస్తుంది. ఈ స్టేషన్‌లు ఈ ప్రాంత వాసులు సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించడంతో పాటుగా 30–50% వరకూ ఆదాచేయడం ద్వారా సస్టెయినబల్‌ జీవనానికి సైతం తోడ్పడుతుంది. ఈ కంపెనీ మరో ఐదు స్టేషన్‌లను అత్యధిక డిమాండ్‌ కలిగిన ప్రొద్దుటూరు, ఒంటిమిట్ట, రైల్వే కోడూరు, కడప నగరం, రాయచోటిలో ప్రారంభించడానికి చురుగ్గా పనిచేస్తుంది. ఈ స్టేషన్‌ల ఏర్పాటుతో మరింతగా ఈ ప్రాంతంలో పర్యావరణ అభివృద్ధికి తోడ్పడటంతో పాటుగా గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలకు మరియు మరింత మంది సీఎన్‌జీకి మారేందుకు, నిలకడతో కూడిన జీవన ప్రక్రియలను అనుసరించేందుకు తోడ్పడనుంది అని నమ్ముతున్నాము’’ అని అన్నారు.

పూర్తి పర్యావరణ అనుకూల వాతావరణ వ్యవస్థను రూపొందించడానికి ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ యొక్క నిరంతర ప్రయత్నాలతో, ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ ఇప్పుడు డీజిల్‌ , పెట్రోల్‌ లాంటి సంప్రదాయ ఇంధనాల కంటే మెరుగైన సీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. సీఎన్‌జీ కి భద్రత పరంగా శక్తివంతమైన రికార్డు ఉంది. ఇది వాహన యజమానులకు ఆర్థిక ప్రయోజనాలను సైతం అందించడంతో పాటుగా మొత్తంమ్మీద పర్యావరణ కాలుష్యం ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అంతిమంగా, ఇంధన సమృద్ధి, గ్యాస్‌ ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా దేశం మారడంలో సహాయం చేస్తుంది.

ఏజీ అండ్‌ పీ యొక్క భారతదేశ వ్యాప్త సీజీడీ నెట్‌వర్క్‌ ఐదు రాష్ట్రాలు– ఆంధ్రప్రదేశ్‌, రాజస్తాన్‌ , కేరళ, కర్నాటక,తమిళనాడు లో 34 జిల్లాల వ్యాప్తంగా 2,78,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కవర్‌ చేస్తున్నాయి.సంస్ధకు 1500కు సీఎన్‌జీ స్టేషన్‌లు ఉన్నాయి మరియు 17,000 ఇంచ్‌–కిలోమీటర్ల పైప్‌లైన్లు ఉన్నాయి. ఏజీ అండ్‌ పీ ప్రస్తుతం సీఎన్‌జీ స్టేషన్‌లను ఈ దిగవ జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌ ః– అనంతపూర్‌, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు; కర్నాటక 100 కోలార్‌, మైసూరు, మాండ్య, హసన్‌, చిక్కమంగళూరు, కొడగు, బాగల్‌కోట్‌, కొప్పల్‌, రాయ్‌చూర్‌, కాలాబురగి, విజయ్‌పుర, శివమొగ, హవేరీ; తమిళనాడు ః– కాంచిపురం, చెంగల్‌పేట, వెల్లూరు, రాణిపేట మరియు రామనాథపరం  కేరళ: అల్లప్జుజ, కొల్లమ్‌ మరియు తిరువనంతపురం ; రాజస్తాన్‌  జోధ్‌పూర్‌, బార్మర్‌లో ఉన్నాయి.

AG & P Pratham held ‘The Green Wheels CNG Rally’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News