Wednesday, January 22, 2025

అనంతరపురంలో ‘డికంప్రెషన్ యూనిట్’ని ప్రారంభించిన ఏజీ & పి ప్రథమ్

- Advertisement -
- Advertisement -

అనంతపురం: భారతదేశంలోని ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో ఒకటైన ఏజీ & పి ప్రథమ్, అనంతపురంలోని మారుతీ నగర్‌లో డికంప్రెషన్ యూనిట్ (DCU) ప్రారంభించటం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ అత్యాధునిక సదుపాయం దూర ప్రాంతాలకు ప్రత్యేకంగా మారుతీ నగర్, రామ్ నగర్, కోవూర్ నగర్‌లకు లబ్ది చేకూర్చే పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరాను వేగవంతం చేస్తుంది. ఈ ప్రాంతాలలో అనుసంధానించబడిన గ్రిడ్ లైన్లు సహజ వాయువును దాదాపు 2500 గృహాలు, 20 వాణిజ్య యూనిట్లకు చేరువ చేస్తాయి, మరీ ముఖ్యంగా స్థానిక నివాసితులు దాని విభిన్న ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందేందుకు వీలు కల్పిస్తాయి.

అనంతపురం నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, ఏజీ & పి ప్రథమ్ ప్రయత్నాలను ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ.. “మా ప్రాంతంలో క్లీన్ ఎనర్జీని పొందేలా చేయడంలో డికంప్రెషన్ యూనిట్‌ని ఏర్పాటు చేయటానికి ఈ కార్యక్రమం కీలకమైన ముందడుగు. ఈ ప్రాజెక్ట్ , అనంతపురం భవిష్యత్తుకు ముఖ్యమైన వాగ్దానాన్ని కలిగి ఉంది. మన సమాజ శ్రేయస్సు కోసం PNG యొక్క వినియోగాన్ని చురుకుగా సమర్ధించవలసిందిగా, అది అందించే విభిన్న ప్రయోజనాల జాబితా నుండి పూర్తిగా ప్రయోజనం పొందాలని నేను ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాను…” అని అన్నారు

ఏజీ & పి ప్రథమ్ అనంతపురం & కడప (AK) ప్రాంతీయ అధిపతి జి ఏ వెంకటేష్ మాట్లాడుతూ.. “ఇది అనంతపురం జిల్లాలో మా రెండవ డికంప్రెషన్ యూనిట్, మేము ఈ సదుపాయాన్ని గర్వంగా స్థానిక నివాసితులకు అంకితం చేస్తున్నాము. హరిత ఇంధన పరిష్కారాలను అందించడానికి మా అచంచలమైన నిబద్ధతను ఇది వెల్లడి చేస్తుంది. ఈ హైటెక్ సదుపాయంలో దాదాపు రూ.50 లక్షల గణనీయమైన పెట్టుబడితో, ఏజీ & పి ప్రథమ్ సుమారు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక సమగ్ర పైప్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు చురుగ్గా నాయకత్వం వహిస్తుంది, ఇది రాబోయే ఆరు నెలల్లో దశలవారీగా పూర్తవుతుంది. రాప్తాడులో ఎల్-సిఎన్‌జి సదుపాయాన్ని ప్రారంభింప చేయడానికి మేము ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను సైతం ప్రారంభించాము, తద్వారా మొత్తం ప్రాంతాన్ని గ్యాస్ పైప్‌లైన్ గ్రిడ్‌తో కలుపుతాము. దీనికి అదనంగా, వచ్చే ఏడాది ప్రారంభంలో మూడు అదనపు సిఎన్‌జి డిస్పెన్సింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది సహజ వాయువు లభ్యతను మరింత పెంచుతుంది” అని అన్నారు.

పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ఏజీ & పి ప్రథమ్ తమ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. కంపెనీ PNG కనెక్షన్‌లు అత్యంత సురక్షితమైనవి, అనుకూలమైనవి, ఆర్థిక పరంగా అందుబాటు ధరలలో ఉంటాయి, సాంప్రదాయ LPGని సజావుగా భర్తీ చేస్తాయి. PNGకి మారడం ద్వారా, వినియోగదారులు LPG సిలిండర్‌లతో పోలిస్తే 15-25% గణనీయంగా ఆదా చేసుకోవటం తో సహా ప్రత్యేక ప్రయోజనాలను పొందగలరు. అదనంగా, పైప్డ్ గ్యాస్ కనెక్షన్‌లు ఎల్‌పిజి సిలిండర్‌ల బుకింగ్, నిల్వ, నిర్వహణ అవసరాన్ని తొలగించడం ద్వారా సురక్షితమైన, అవాంతరాలు లేని రోజువారీ వినియోగాన్ని నిర్ధారిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News