Thursday, January 23, 2025

ఎజి వేణుగోపాల్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

AG Venugopal tenure extended by another 3 months

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు మరో మూడు నెలల పాటు భారత అటార్నీ జనరల్‌గా(ఎజి) కొనసాగడానికి సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ప్రస్తుతం ఏడాది పదవీకాలంలో కొనసాగుతున్న 91 ఏళ్ల వేణుగోపాల్ ఈ నెల 30న పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే..వ్యక్తిగత కారణాల ర్యీ ఈ రాజ్యాంగ పదవిలో కొనసాగేందుకు ఆయన ఇష్టపడడం లేదని వర్గాలు తెలిపాయి. కాగా..కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు మరో మూడు నెలలు ఈ పదవిలో కొనసాగడానికి ఆయన అంగీకరించినట్లు వారు తెలిపారు. 2017 జులైలో ముకుల్ రోహత్గి స్థానంలో అటార్జీ జనరల్‌గా నియమితులైన కెకె వేణుగోపాల్ ఆ తరువాతి నుంచే అదే పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. అటార్జీ జనరల్ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. మొదట నియమితులైనపుడు వేణుగోపాల్ పదవీకాలం 2020లో ముగిసింది. ఆ తర్వాత ఏడాది చొప్పున ఆయన పదవీకాలం కొనసాగుతూ వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News