Monday, December 23, 2024

మళ్లీ కారుదే జోరు

- Advertisement -
- Advertisement -

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 11 లోక్ సభ స్థానాలు బిఆర్ఎస్ వే

టైమ్స్ నౌ సర్వేలో వెల్లడి కెసిఆర్ పాలనకు
పెరుగుతున్న ఆదరణ.. స్పష్టం చేసిన సర్వే

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బిఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని తాజా టైమ్స్ నౌ సర్వేలో తేలింది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ 9 నుంచి 11 సీ ట్లు గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే పే ర్కొంది. బిజెపి 2 నుంచి మూడు సీట్లు, కాంగ్రెస్ 3 నుంచి 4 సీట్లు విజయం సాధించే అవకాశం ఉందని, ఇతరులు కూడా ఒక సీటు గెలిచే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. గత నెలలో నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా టైమ్స్ నౌ విడుదల చేసింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలకు ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

నిరుపేదలకు నిరంతరాయంగా అం దిస్తున్న ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బిసి బంధు తదితర సం క్షేమ పథకాలతో నేరుగా అందుతున్న నగదు సాయం, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్న పారదర్శక పాలనతో జనాదరణను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మొత్తం వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లోనూ బిఆర్‌ఎస్ విజయం సాధించడం అసాధ్యం కాదని ఆ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News