Monday, December 23, 2024

చమురు వ్యూహానికి భారత్ బలి!

- Advertisement -
- Advertisement -

రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన కరెన్సీలో చెల్లింపుల గురించి సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో అమెరికా డాలరు వాటా 40 శాతం ఉంది. 2021 డిసెంబరులో చైనా కరెన్సీ 2.7 శాతం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 3.2 శాతానికి పెరిగింది. జపాన్ ఎన్‌ను వెనక్కు నెట్టి 4వ స్ధానానికి ఎదిగింది. ఈ ఏడాది జనవరిలో ఇతర కరెన్సీల చెల్లింపులు 6.48 శాతం తగ్గితే చైనా కరెన్సీ 11 శాతం పెరిగినట్లు స్విఫ్ట్ వెల్లడించింది.

మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. మే 6వ తేదీన ఇది రాసిన సమయంలో బ్రెంట్ రకం ధర 113.49 డాలర్లు ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యా నుంచి ఇంధన దిగుమతులపై పూర్తి ఆంక్షలు విధించాలని ఐరోపా సంఘం (ఇయు) అధికారికంగా ప్రతిపాదించటంతో చమురు ధర పెరిగింది. ఈలోగా సభ్యదేశాలు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. దీన్ని బట్టి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధపడుతున్నాయని భావించాల్సి వస్తోంది. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని ఆరనివ్వకుండా చూస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దీని పర్యవసానాలు ఎలా ఉండేదీ చెప్పలేము. కేంద్రం పన్నులు తగ్గించకపోతే మన దేశంలో మరింతగా చమురు ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరగటం ఖాయం.
కొన్ని దేశాలు పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉన్నందున రష్యా ఇంధనంపై పూర్తి నిషేధం అంతసులభం కాదని తెలుసుకోవాలి. ఇదే తరుణంలో ప్రత్నామ్నాయం చూసుకోవాలని ఐరోపా కమిషన్ అధ్యక్షరాలు ఉజులా వాండర్ లెయన్ ఐరోపా పార్లమెంటులో చెప్పారు. సముద్రం ద్వారా, పైప్‌లైన్, ముడి లేదా శుద్ధి చేసినదీ ఏ రూపంలోనూ, ఏ విధంగానూ అక్కడి నుంచి దిగుమతి చేసుకోరాదని, ఆరునెలల్లో ముడి చమురు, ఏడాదికి చివరికి శుద్ధి చేసిన సరకు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని తద్వారా రష్యాపై గరిష్ఠంగా వత్తిడి తేగలమన్నారు. పుతిన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుదన్నారు.ఐరోపా పార్లమెంటు నిర్ణయాన్ని సభ్యదేశాలు ఆమోదించాల్సి ఉంది. తమ వల్ల కాదని జపాన్ చెప్పేసింది. హంగరీ, స్లోవేకియా ఈ నిర్ణయాన్ని వీటో చేస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రష్యా నుంచి ఇంధన దిగుమతులను నిలిపివేసే అవకాశం లేదని జపాన్ పరిశ్రమల మంత్రి కొషి హగిఉదా తేల్చి చెప్పారు. అమెరికా ఇంధనశాఖ మంత్రితో భేటీలో దీని ప్రస్తావన వచ్చింది. ఇంధన భద్రత ఒక్కో దేశానికి ఒకో విధంగా ఉంటుందని, అమెరికాకు అనుగుణంగా తాము ఉండలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అవసరాల్లో నాలుగు శాతం చమురు, తొమ్మిది శాతం ఎల్‌ఎన్‌జిని జపాన్ దిగుమతి చేసుకుంటున్నది.
జర్మనీలో పెద్ద మొత్తంలో గ్యాస్ దిగుమతి చేసుకొనే యునిపర్ సంస్ధ రష్యాకు రూబుళ్లలో చెల్లించాలని నిర్ణయించింది. తమ నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే వారు రూబుళ్లలోనే చెల్లించాలని గత నెలలో పుతిన్ చేసిన ప్రకటనను అంగీకరించరాదని ఐరోపా కమిషన్ ప్రకటించినప్పటికీ జర్మన్ సంస్ధ దానికి భిన్నంగా పోతున్నది.రష్యా నిర్ణయం ప్రకారం దాని స్నేహితులు కాని దేశాల సంస్ధలు గాజ్‌ప్రోవ్‌ు బాంకులో రెండు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒక ఖాతాలో తాము చెల్లించే విదేశీ కరెన్సీని జమచేస్తే దాన్ని బాంకు రూబుళ్లలోకి మార్చి బ్యాంకు రూబుల్ ఖాతాకు బదిలీ చేస్తుంది. రూబుళ్లలో చెల్లించని పక్షంలో ఇంధన సరఫరా నిలిపివేస్తామని పోలాండ్, బల్గేరియాకు గాజ్‌ప్రోవ్‌ు చెప్పేసింది. యునిపర్ చర్య ఆంక్షలను ఉల్లంఘించటమే అని ఐరోపా కమిషన్ చెప్పింది.
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పు లో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన కరెన్సీలో చెల్లింపుల గురించి సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో అమెరికా డాలరు వాటా 40 శాతం ఉంది. 2021 డిసెంబరులో చైనా కరెన్సీ 2.7 శాతం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 3.2 శాతానికి పెరిగింది. జపాన్ ఎన్‌ను వెనక్కు నెట్టి 4 వ స్ధానానికి ఎదిగింది. ఈ ఏడాది జనవరిలో ఇతర కరెన్సీల చెల్లింపులు 6.48 శాతం తగ్గితే చైనా కరెన్సీ 11 శాతం పెరిగినట్లు స్విఫ్ట్ వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచంలో రిజర్వు కరెన్సీలో చైనా మూడవ స్థానంలో ఉంటుంది. ఉక్రెయిన్ పరిణామాలతో అమెరికా పెద్దగా ప్రభావితం కాలేదు. కానీ అక్కడ మే 5వ తేదీన సహజ వాయువు ధర (ఎంఎంబిటియు) 8.32 డాలర్లకు పెరిగింది. ఇది 13 సంవత్సరాల నాటి రికార్డును అధిగమించింది. రానున్న కొద్ది వారాల్లో పది డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నారు. 2008లో గరిష్ఠంగా 14డాలర్లు దాటింది. 2020లో కనిష్టంగా 2.10 డాలర్లు నమోదైంది. పీపా చమురును 70 డాలర్ల కంటే తక్కువకు సరఫరా చేయాలని మన దేశం రష్యాతో బేరమాడుతోందని బ్లూవ్‌ుబెర్గ్ పేర్కొన్నది. రవాణా, ఆంక్షలు, నిధుల వంటి ఇబ్బందులను గమనంలో ఉంచుకొని రాయితీ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది. ఒప్పందం కుదిరితే మే నెలలో 15 మిలియన్ పీపాలు దిగుమతి చేసుకోవచ్చని, ఇది భారత్ దిగుమతుల్లో పది శాతానికి సమానమని కూడా వెల్లడించింది.
ఒకవైపు అమెరికా బెదిరిస్తున్నప్పటికీ మన దేశం రష్యా చమురు కోసం బేరసారాలాడటంలో ఆర్ధికాంశంతో పాటు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉన్నాయి. 201314లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఎసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.

సంవత్సరం               డాలర్లలో ధర
2014-15                84.16
2015-16                46.17
2016-17                47.56
2017-18                56.43
2018-19                69.88
2019-20                60.47
2020-21               44.82
2021-22                79.18

పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్ సింగ్ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్ర మోడీ సర్కార్ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించ లేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం.వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్ సింగ్ సర్కార్ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్ర మోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.
ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు ఐరోపా సంఘ (ఇయు) దేశాలు చమురు, గ్యాస్, బొగ్గు దిగుమతులకు గాను రష్యాకు 50 బిలియన్ డాలర్లు చెల్లించాయి. ఒపెక్, దానితో అనుసంధానం ఉన్న మొత్తం 23 దేశాలు ప్రతి నెలా సమావేశమై మార్కెట్‌ను సమీక్షిస్తాయి. ఇవి 40 శాతం చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా జరిపిన సమీక్షలో ఇంతకు ముందే నిర్ణయించిన మేరకు స్వల్పంగా తప్ప ఉత్పత్తిని పెంచరాదని తీర్మానించాయి. రోజుకు పది మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేసే రష్యా మీద ఆంక్షల కారణంగా సరఫరా తగ్గితే గిరాకీ మేరకు ధరలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఇదే జరిగితే మన వంటి దేశాల మీద భారం పెరుగుతుంది. ఒపెక్ దేశాలు రోజుకు 28 మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది మొత్తం ఉత్పత్తిలో 30 శాతానికి సమానం. ఐరోపాలోని రష్యా మార్కెట్‌ను ఆక్రమించేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నది. అవి తగ్గిపోతున్నందున ఆ మేరకు ఉత్పత్తిని పెంచాల్సి ఉంది. ఐరోపా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలంటే అందుకు పెట్టుబడులు, పరికరాలు, సిబ్బంది కూడా అవసరమే. తీరా ఆ మేరకు పెట్టుబడులు పెట్టిన తరువాత ఎగుమతి అవకాశాలు తగ్గితే ఎలా అన్న గుంజాటనలో అమెరికా కంపెనీలు ఉన్నాయి.
ఒపెక్, దానితో సమన్వయం చేసుకుంటున్న దేశాలు ఉత్పత్తి నియంత్రణ, ధరల పెంపుదలకు కుమ్మక్కు అవుతున్నాయని, అందువలన అలాంటి దేశాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పిస్తూ ఒక బిల్లును అమెరికా సెనెట్ న్యాయ కమిటీ ఆమోదించింది. దీనికి నోపెక్ (నో ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఎక్స్‌పోర్టింగ్ కార్టెల్స్) అని పేరు పెట్టారు. దీన్ని పార్లమెంటు ఆమోదిస్తే తప్ప చట్టం కాదు. ఇలాంటి బిల్లు గురించి గత రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు వస్తున్నా పార్లమెంటులోల ప్రవేశపెట్టలేదు. అమెరికాలో కూడా చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

                                                                                          ఎం కోటేశ్వరరావు(8331013288)

Again Fuel price hiked in International Market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News