Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌కే మళ్లీ అధికారం

- Advertisement -
- Advertisement -

గులాబీ పార్టీకి -40.3 శాతం ఓటర్లు అనుకూలం
కాంగ్రెస్ -37.1 శాతం, బిజెపి 11.6 శాతం
డెమాక్రసీ టైమ్స్ నెట్‌వర్క్ సర్వేలో వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అధికారం మళ్లీ బిఆర్‌ఎస్ పార్టీదేనని ‘డెమాక్రసీ టైమ్స్ నెట్‌వర్క్’ సర్వే తేల్చింది.  రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఈ నెల 13 నుంచి 25 వరకు వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించి ‘డెమాక్రసీ టైమ్స్ నెట్‌వర్క్’ సర్వే ఫలితాలను వెల్లడించింది. బిఆర్‌ఎస్ -40.3 శాతం, కాంగ్రెస్ -37.1 శాతం, బిజెపి -11.6 శాతం, బిఎస్‌పి 4.6 శాతం, మజ్లిస్ 2.6 శాతం, ఇతరులకు 3.8 శాతం ఓట్లు వస్తాయని డెమాక్రసీ టైమ్స్ నెట్‌వర్క్ అంచనా వేసింది. గతంలో నిర్వహించిన ట్రాకర్ కంటే, అక్టోబర్ 13 నుంచి 25 వరకు నిర్వహించిన తాజా ట్రాకర్‌లో 3 శాతం హెచ్చుతగ్గులు ఉన్నాయని తెలిపింది.

మెజార్టీ ప్రజలు బిఆర్‌ఎస్ వైపు
రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లు బిఆర్‌ఎస్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు, బిఆర్‌ఎస్‌కే అత్యధిక మెజార్టీ ఖాయమని ‘డెమాక్రసీ టైమ్స్ నెట్‌వర్క్’ తాజా ట్రాకర్ ఫలితాల్లో వెల్లడైంది. డెమెక్రసీ టైమ్స్ నెట్‌వర్క్ ట్రాకర్ అంచనా ప్రకారం అత్యధిక శాతం ఓటర్లు బిఆర్‌ఎస్ పట్ల అనుకూలత వ్యక్తం చేశారు. ఈ సర్వే ప్రకారం ఓటర్ల శాతంలో కాంగ్రెస్ రెండోస్థానంలో, బిజెపి మూడోస్థానంలో నిలువనుంది. ఈ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఓట్ల శాతంలో నాలుగో స్థానంలో నిలువనున్నట్లు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News