Friday, January 24, 2025

బిసిసిఐ చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) చీఫ్ సెలెక్టర్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. అగార్కర్‌ను భారత క్రికెట్ బోర్డు సెలెక్షన్ కమిటీగా ఎంపిక చేసినట్టు బిసిసిఐ మంగళవారం అధికారికింగా ప్రకటించింది. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపేలతో కూడిన క్రికెట్ అడ్వయిజరీ కమిటీ అగర్కార్‌ను సుదీర్ఘంగా ఇంటర్వూ చేసింది. అగర్కార్ ఇచ్చిన ప్రజంటేషన్‌పై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది.

తర్వాత నివేదికను బిసిసిఐకి సమర్పించింది. దీనిపై సమాలోచనలు చేసిని బిసిసిఐ అగార్కర్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తున్నట్టు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న చేతన్ శర్మ ఆ పదవి నుంచి వైదొలగడంతో కొత్త చైర్మన్‌ను బిసిసిఐ ఎంపిక చేసింది. ఇదిలావుండగా సెలెక్షన్ కమిటీలో అగర్కార్‌తో పాటు శివ్‌సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలిల్ అంకోలా, శ్రీధరన్ శరత్ సభ్యులుగా ఉన్నారు. కాగా, అగర్కార్ మూడు ఫార్మాట్‌లలోనూ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, మరో నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News