- Advertisement -
టాలెంటెడ్ హీరో జీవా, యాక్షన్ కిం గ్ అర్జున్ సర్జా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్స్‌పై ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
మేకర్స్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ‘సుమారు 120 ఏళ్ళ క్రితం బ్రతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు’ అనే వాయిస్‌తో మొదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్‌తో సర్‌ప్రైజ్ చేసిం ది. “అవేంజర్స్’తరహాలో ప్రేక్షకులను వేరే ప్ర పంచానికి తీసుకెళ్లే ఫాంటసీ థ్రిల్లర్ ‘అగత్యా’. ‘అగత్యా’ ఫిబ్రవరి 28న తమిళం, తెలుగు, హిం దీ భాషలలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
- Advertisement -