Saturday, December 21, 2024

పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు

- Advertisement -
- Advertisement -

పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో…
అభ్యర్ధుల వయోపరిమితి మరో రెండేళ్ళు పెంపు
కీలక నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్

Over 3.52 lakh applications submitted for ts police jobs

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగించారు. రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News