Thursday, January 16, 2025

‘హిండెన్‌బర్గ్‌’పై దాడులా?టేకోవరా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హై-దరాబాద్ : బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి)కి చెందిన ఢిల్లీ కార్యాలయం, ముంబై స్టూడియోలో ఆదాయపు పన్ను శాఖ సోదాలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఐటి శాఖ, సిబిఐ, ఇడి వంటి ఏజెన్సీలు బిజెపికి ’అతిపెద్ద కీలుబొమ్మలుగా’ మారాయని విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

అదానీ వ్యవహారాల లొసుగులను బయటపెట్టిన హిండెన్‌బర్గ్‌పై ఇడితో దాడులు చేయి స్తారా? లేక టేకోవర్ చేస్తారా? అని నిలదీశారు. ‘ఏమిటి ఆశ్చర్యం!! మోడీపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని వారాల్లోనే ఐటి దాడులు జరిగాయి.ఐటి, సిబిఐ, ఇడి వంటి ఏజెన్సీలు బిజెపికి అతిపెద్ద కీలుబొమ్మలుగా మారినందుకు నవ్వొస్తోంది’ అని వ్యాఖ్యనించారు.బిబిసిపై ఐటీ రెయిడ్స్‌కు సంబంధించి వివిధ మీడియా సంస్థలు రాసిన కథనాలను తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News