Saturday, November 23, 2024

ఏజెన్సీ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుచాలి: సినీనటుడు సుమన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న బీసీ వర్గాలలోని సంచార, అర్థ సంచార, విముక్త కులాలను గుర్తించి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు నిర్దిష్టంగా సూచనలను ప్రభుత్వానికి ఇవ్వాలని సినీ నటుడు సుమన్ కోరారు. శుక్రవారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు, సి.హెచ్.ఉపేంద్ర, కె. కిశోర్ గౌడ్‌లతో సమావేశమై పలు అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు బీసీ వర్గాలకు ఎంతగానో చేయూతను అందిస్తున్నాయని సుమన్ కితాబు ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న విముక్త, సంచార, అర్థ సంచార కులాలు, జాతుల ప్రజలకు చైతన్య రహితం కారణంగా వాటిని పూర్తి స్థాయిలో అందుకోలేక పోతున్నారని కమిషన్‌కు వివరించారు. ఇలాంటి జాతులు, కులాల ప్రజల వాస్తవ జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరారు. కొన్ని ప్రాంతాలలో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లాంటి ప్రయోజనాలను కూడా స్థిర నివాసులుగా లేని కారణంగా పొందలేక పోతున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా రాష్ట్ర బీసీ జాబితాలోని ఏ గ్రూప్ లో సంచార, విముక్త కులాల నిమిత్తం ప్రత్యేక అధ్యయనం నిర్వహించి, వారి జీవితాలలో ప్రభుత్వం వెలుగులు నింపే దిశగా రాష్ట్ర బీసీ కమిషన్ సిఫారసులు ఉండాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News