Wednesday, January 22, 2025

కాంబోడియా జాబ్ రాకెట్‌లో కీలక ఏజెంట్ ఢిల్లీలో అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కాంబోడియా జాబ్ రాకెట్‌లో కీలక ఎజెంట్ యూపీకి చెందిన సదాకత్ ఖాన్‌ను ఢిల్లీలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్‌బి) అరెస్టు చేసింది. ఈ నెల 2వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సడకత్ ఖాన్ మాల్దీవుల నుంచి తిరిగి వస్తుండగా టిజిసిఎస్‌బి అరెస్టు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురు ఏజెంట్లు జగిత్యాల్‌కు చెందిన కె. సాయి ప్రసాద్, పూణెకు చెందిన మహ్మద్ అబిద్ హుస్సేన్ అన్సారీ (బీహార్ స్థానికుడు), బీహార్‌కు చెందిన మహ్మద్ షాదాబ్ ఆలం గతంలో అరెస్టయ్యారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…విదేశీ ఉపాధి హామీ పేరుతో ఏజెంట్లు కె. సాయి ప్రసాద్, మహ్మద్ అబిద్ అన్సారీ, మహ్మద్ షాదాబ్ ఆలం, సదకత్ ఖాన్‌లు 1,40,000 వసూలు చేసిన తర్వాత తనను కంబోడియాకు రప్పించారని, అక్కడికి చేరుకోగానే తన పాస్‌పోర్ట్‌ను ఏజెంట్లు లాక్కున్నారని, తదనంతరం సైబర్ క్రైమ్‌లకు పాల్పడేలా నిర్బంధించారని, రోజుకు 16 నుండి 17 గంటలు పని చేయించేవారని సిరిసిల్ల వాసియైన బాధితుడు తన దీనావస్థను తన తల్లికి తెలిపాడు.

తనలాగే 500 నుంచి 600 మంది భారతీయులు ఒకే కంపెనీ కోసం ఆన్‌లైన్ మోసానికి బలయ్యారని సూచించాడు. దీంతో తన కొడుకు విషయమై బాధితుడి తల్లి ఈ ఏడాది మే 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు టిజిసిఎస్‌బి అధికారులు బాధితుడిని తెలంగాణకు తీసుకొచ్చారు. తనను శారీరకంగా హింసించారని, నిర్బంధించారని, ప్రాణా కు తెగించి బలవంతంగా వసూళ్లు చేశారని ఈ సందర్భంగా బాధితుడు పోలీసులకు వివరించాడు. ఏజెంట్లు లాభదాయకమైన విదేశీ ఉపాధి హామీలతో ఉద్యోగార్ధులను ఆకర్షిస్తారు, ప్రాసెసింగ్ ఫీజులు, రిజిస్ట్రేషన్, వీసా ఛార్జీల ముసుగులో గణనీయమైన మొత్తంలో డబ్బును వసూలు చేస్తారు. కంబోడియాకు చేరుకున్న తర్వాత, బాధితులను చైనా హ్యాండ్లర్‌లకు అప్పగిస్తారు, వారు వారిని సైబర్ క్రిమినల్ కార్యకలా పాలకు బలవంతం చేస్తారు. బాధితుల నుండి ఏదైనా ప్రతిఘటన భౌతిక హింస,నిర్బంధానికి వెనుకాడరు. బాధితుల జీవితాలకు ముప్పు వాటిల్లుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News