Monday, December 23, 2024

యాక్షన్- ప్యాక్డ్ లుక్

- Advertisement -
- Advertisement -

AGENT Movie Teaser to release tomorrow

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్‘. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ శుక్రవారం సాయంత్రం 5:05 గంటలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఓ యాక్షన్- ప్యాక్డ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో అఖిల్ పోనీటైల్‌తో స్టైలిష్‌గా డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. శరీరమంతా గాయాలతో ఉన్న యూత్ కింగ్.. గాట్లింగ్ గన్‌తో ఫైరింగ్ చేస్తుండటాన్ని చూడవచ్చు.

’ఏజెంట్’ సినిమాలో అఖిల్ ని సరికొత్తగా చూపిస్తున్నాడు సురేందర్ రెడ్డి. గూఢచారి పాత్రకు అవసరమైన విధంగా తనను తాను మార్చుకోవడానికి అఖిల్ చాలా కష్టపడ్డాడు. అతను కోరుకున్న ఆకృతిని పొందడానికి కఠోర శ్రమ చేశాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇది నెక్స్ లెవెల్‌లో ఉంటుందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ’ఏజెంట్’ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఎంతో స్టైలిష్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ చివరి దశలో ఉంది. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

AGENT Movie Teaser to release tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News