Monday, January 20, 2025

‘మళ్ళీ మళ్ళీ…’ వినాలనిపించే పాట..

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్‌లో ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. మేకర్స్ మొదటి సింగిల్ ‘మళ్ళీ మళ్ళీ…’ పాటని విడుదల చేశారు. ఈ పాటను అక్కినేని ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మొదటిసారిగా అఖిల్ ట్విట్టర్ స్పేస్‌లలో అభిమానులతో ముచ్చటించారు.

ఈ పాటను యూనిక్ స్టయిల్‌లో లాంచ్ చేశారు. హిప్-హాప్ తమిళ ఆకట్టుకునే నెంబర్‌ని కంపోజ్ చేశారు. పాటలో వినిపించిన ఇంగ్లీష్ ర్యాప్ అలరించింది. అఖిల్ ఈ పాటలో అల్ట్రా- స్టైలిష్‌గా కనిపించారు. సాక్షి వైద్య అందంగా కనిపించింది. సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్, క్యారెక్టర్‌లో అఖిల్‌ని చూపిస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News