Sunday, November 17, 2024

ఆగని బెంగాల్ జూడాల సమ్మె.. బైఠాయింపు

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు ఆసుపత్రుల్లో తమ ‘పని నిలిపివేత’ ఆందోళనను, కోల్‌కతాలో స్వాస్థ భవన్ సమీపంలో బైఠాయింపును మంగళవారం ఉదయం కొనసాగించారు. ముందు రోజు రాత్రి చేసిన ప్రకటనలను రాష్ట్ర ప్రభుత్వం ‘మనస్ఫూర్తి’గా అమలు చేసిన తరువాతే తమ ఆందోళన విరమణపై తుది నిర్ణయం తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి ఐదవ ప్రయత్నంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అనంతరం తమ ‘పాక్షిక విజయం’పై నిరసనకారులైన డాక్టర్లు సంతృప్తి వ్యక్తం చేశారు.

‘వాస్తవంలో పటిష్ఠమైన చర్యలను, సుప్రీం కోర్టు విచారణలో పురోగతిని చూసిన తరువాతే తమ ప్రస్తుత ఆందోళన, ‘పని నిలిపివేత’ విషయమై మేము ఇప్పటికే చెప్పినట్లుగా మా తదుపరి చర్యను నిర్ణయిస్తాం’ అని నిరసనకారుడైన ఒక డాక్టర్ పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్థ భవన్ సమీపంలో నిరసన ప్రదేశంలో మంగళవారం చెప్పారు. ‘మా లక్షం న్యాయం సాధించడం. మేము పాక్షిక విజయం పొందినా ఆరోగ్య శాఖ కార్యదర్శిని తొలగించలేదు’ అని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News