Saturday, November 16, 2024

తొలిరోజే సింగ‘రణం’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే సింగరేణి బొగ్గు గనుల వేలంపై దద్దరిల్లింది. సభా వేదికగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎంపిలు గళం విప్పారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు బొగ్గు గనుల వేలంపై సభలో రగడ జరిగింది. బుధవారం జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ అంశాన్నీ లేవనెత్తారు. తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని నాలుగు బొగ్గు గనులను వేలం వేయడాన్ని ప్రస్తావించారు.

వాటిని ప్రభుత్వ సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను రద్దు చేసి సింగరేణి కాలరీస్‌కు బొగ్గు బ్లాకులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిం గరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో తెలంగాణ, కేంద్రం మధ్య 51:49 శాతం మేర జాయింట్ వెం చర్ అని అన్నారు. అలాంటప్పుడు గనులను ఎ లా ప్రైవేటీకరిస్తారనిప్రశ్నించారు. పైగా సింగరేణి ని ప్రైవేటీకరణ చేయబోమని తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని ఆయన లో క్‌సభ దృష్టికి తెచ్చారు. ఉత్తమ్ అడిగిన ప్రశ్నకు మ ద్దతుగా టిఆర్‌ఎస్ ఎంపిలో కూడా జీర్ అవర్‌లో లేచి ఆందోళన చేశారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వేల నిర్ణయన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. సింగరేణి సంస్థలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వా ల ఉమ్మడి భాగస్వామ్యం ఉందన్నారు. వేలం మొ దలైనప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. ఈ నేపపథ్యంలో పారదర్శకంగా వేలం ప్ర క్రియ నిర్వహిస్తామని, దీనికి అంగీకరిస్తే తెలంగాణకు కూడా ప్రయోజనం ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు. కోల్ స్కామ్‌లో ఉన్నవాళ్లే పారదర్శక వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని జోషి ఆరోపించారు. వేలం ప్రక్రియకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. వేలం ద్వారా వచ్చే ఆదాయమంతా రాష్ట్ర ప్రభుత్వాలకు వెలుతుందని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.

కేంద్ర ప్రకటనపై టిఆర్‌ఎస్ ఎంపీల ఫైర్

బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేలంపై కేంద్రం చేసిన ప్రకటనపై టిఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో తెలంగాణ పట్ల కేంద్రానికి ఉన్న వివక్ష మరోసారి నిరూపితమైందన్నారు. సింగరేణి కాలనీస్ తెలంగాణకు గుండెకాయ లాంటిదని టిఆర్‌ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, రంజిత్‌రెడ్డిలు అన్నారు. సింగరేణిని ప్రయివేటు పరం చేయొద్దని గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయమని సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనలో చాలా స్పష్టంగా ప్రకటన చేశారన్నారు.

కానీ నేడు పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు నాలుగు బ్లాకులు ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ సమాధానం ఇచ్చారన్నారు. ఈ అంశంపై వారు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అంటే కేంద్రానికి ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు ఇవ్వొద్దు.. మైన్స్ ఉండొద్దని కేంద్రం చూస్తున్నదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేశారని ఈ సందర్భంగా నామా దుయ్యబట్టారు. సింగరేణి కాలనీని తెలంగాణ రాష్ట్రానికి వదిలేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 49 శాతం వాటా కూడా తామే తీసుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా 38 బ్లాకులు అమ్ముతున్నట్లు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి చెప్పారన్నారు.

దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక పిఎస్‌యు కంపెనీ సింగరేణి అని అన్నారు. వచ్చే ఏడాది 68 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి సింగరేణి లక్ష్యం పెట్టుకున్నదన్నారు. ఇలాంటి సందర్భంగా నాలుగు బొగ్గు గనులను కేంద్రం వేలానికి పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. అయితే పాలసీ ప్రకారము ఆప్షన్ పెట్టామని కేంద్రం చెబుతుండడం తగదన్నారు. పాలసీలో మూడు ఆప్షన్స్ ఉన్నాయని, అందులో ఒకటి రాష్ట్రానికి కూడా కేటాయించవచ్చు అనేది కూడా ఉందన్నారు. దీని ఆదారణంగానే గణులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరామన్నారు. అయినప్పటికీ కేంద్రం ఇవ్వట్లేదని మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News