Tuesday, November 5, 2024

అధికారిక ప్రకటన వరకూ ఆందోళన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సదాశివనగర్/కామారెడ్డి: కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ రద్దు ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తేల్చి చెప్పింది. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం భవిష్యత్తు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఏడు గ్రా మాలకు చెందిన మాస్టర్ ప్లాన్ బాధిత రైతులతో ఆదివారం అత్యవసర స మావేశం నిర్వహించారు. శనివారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు.

కలెక్టర్, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ విలేఖరుల సమావేశంలో చెప్పిన విషయాలపై సమావేశంలో నేతలు కూలంకషంగా చర్చించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసి రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే స్వాగతించి సన్మానాలు చేస్తామన్నారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చేవరకు నమ్మేదిలేదన్న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను కోల్పోయేది లేదని చెప్పిన కమిటీ.. ఈనెల 9న మున్సిపల్ కౌన్సిలర్లందకీ వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా 11న మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాలని తీర్మానించింది. అప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేర్కొంది.

ముందే ఎందుకు చెప్పలేదు..
మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి

పట్టణ నూతన మాస్టర్ ప్లాన రద్దు కోసం రైతులు ఆందోళన బాటపట్టినప్పుడు కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా ఉందని.. అధికారులు, నాయకులు మందే ఎందుకు రైతులకు చెప్పలేదని బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ రద్దు ప్రకటనను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయాలన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీతో కలసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.

నమ్మకం కలిగేలా జీఓ జారి చేయాలి
పిసిసి రాష్ట్ర కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

మాస్టర్ ప్లాన్ రద్దుపై ప్రకటన కాదు.. రైతులకు నమ్మకం కలిగేలా జివో జారీ చేయాలని పిసిసి రాష్ట్ర కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉటుందన్నారు. ఇండస్ట్రియల్ జోన్‌లో భూమి పోతుందని ఆత్మహత్య చేసుకున్న పయ్యావుల రాములు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. త్వరలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రానున్నట్టు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News