Monday, December 23, 2024

భగ్గుమన్న నిరసన జ్వాల… లంక ప్రధాని ఇంటికి నిప్పు

- Advertisement -
- Advertisement -

Agitators set fire to Prime Minister Ranil Wickremesinghe's residence

కొలంబో : శ్రీలంకలో నిరసనజ్వాలలు మరింత భగ్గుమన్నాయి. శనివారం ఆందోళనకారులు ప్రధాని రణిల్ విక్రమ్‌సింఘే నివాసాన్ని తగులబెట్టారు. ఉదయం నిరసనకారులు దేశాధ్యక్షుడి నివాసాన్ని చుట్టుముట్టి లోపలికి చొరబడిన తరువాత ప్రధాని నివాసంపై దాడికి దిగారు. ప్రధానికి చెందిన పలు వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. ప్రధాని నివాసం ఈ దాడిలో పూర్తిగా ధ్వంసం అయిందని పిఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ లోగానే విధ్వంసకాండ చెలరేగింది. మరోవైపు నిరసనకారులు దేశాధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి ఇల్లంతా తిరిగారు. కొందరు కిచెన్‌లోకి వెళ్లి తాగి తిన్నట్లు తెలిపే వీడియోలు వెలువడ్డాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News