Thursday, January 23, 2025

విద్యార్థిని మృతి… పాఠశాల బస్సుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

- Advertisement -
- Advertisement -

Agitators set fire to school bus over student death

చెన్నై: పాఠశాల ఆవరణంలో 12వ తరగతి బాలిక అనుమానాస్పదంగా మృతి చెందడంతో మృతురాలి బంధువులు, స్థానికులు పాఠశాల బస్సులకు నిప్పుపెట్టిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కళ్లకురిచి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జూన్ 13న కనియామూర్ లో ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణంలో 12వ తరగతి (ప్లస్ టు) విధ్యార్థిని అనుమానస్పదస్థితిలో దుర్మరణం చెందింది. జూన్ 13 నుంచి మృతురాలి బంధువులు, స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఆదివారం 2000 మంది ఆందోళనకారులు పోలీసులపై దాడి చేసి పాఠశాల లోపలికి వెళ్లారు. పాఠశాల బస్సులను తగలబెట్టడంతో పాటు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఇతర జిల్లాల నుంచి భారీగా బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని జిల్లా ఎస్ పి తెలిపాడు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 20 మంది పోలీసులతో పాటు డిఐజి కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ కేసును సిబిసిఐడికి అప్పగించాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేశారు.  స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు మరో ఇద్దరు టీచర్లు అరెస్టు చేశారని కళ్లకురిచి కలెక్టర్ పిఎన్ శ్రీధర్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News