Tuesday, November 5, 2024

అగ్నిపథ్‌ను తక్షణమే విరమించుకోవాలి: ఆర్. కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

Agneepath must be Should be canceled: R Krishnaiah

పోలీసు కాల్పుల్లో మృతునికి రూ.5 కోట్లు పరిహారం ఇవ్వాలి
తెలంగాణ నిరుద్యోగ జాక్ డిమాండ్

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ నిరుద్యోగ జాక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యువత నిరసన సందర్భంగా పోలీసు కాల్పుల్లో మరణించిన వారికి రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆర్మీ తదితర విభాగాల్లో ధేశ రక్షణ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ ను యువత వ్యతిరేకిస్తున్నందున ఆర్మీ రిక్రూట్‌మెంట్ పాత విధానాన్నే కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ గురించి నిరుద్యోగుల్లో అనేక భయాందోళనలఅఉ ఉన్నాయని, అసంతృప్తి రగులుతోందని కృష్ణయ్య అన్నారు. నిరుద్యోగ జెఎసి చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో బిసి భవన్‌లో ఏర్పాటు చేసిన నిరుద్యోగుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు.

సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి, కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసు కాల్పుల్లో గాయపడిని వారికి తగిన చికిత్స అందించాలని, కాల్పుల్లో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలనికోరారు. దేశంలో నానాటికి నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని, అగ్నిపథ్ పేరుతో నాలుగు సంవత్సరాల ఉద్యోగం పేరిట కొత్త ప్రయోగాలు చేయడం వల్ల దేశం అల్లకల్లోలం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిసి నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, మల్లేష్ యాదవ్, బి. రాజేందర్, వేముల రామకృష్ణ, జి.కృష్ణ యాదవ్, జోషి రాఘవ, డి.సదయ్య, ఎన్.అనిల్ కుమార్ యాదవ్, పివి నర్సింహారాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News