Monday, December 23, 2024

విస్తృత చర్చల తర్వాతే ‘అగ్నిపథ్’ రూపకల్పన: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

India to ban imports of 101 defense products

విస్తృత చర్చల తర్వాతే ‘అగ్నిపథ్’ రూపకలన
సైనికుల నియామక ప్రక్రియలో ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుంది
రాజకీయ కారణాలతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు
అగ్నివీరులకు శిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు
టీవీ9 మీడియా గ్రూపు సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిపై స్పందించారు. మాజీ సైనికులు సహా వివిధ వర్గాలతో విస్తృతస్థాయి చర్చలు జరిపిన తర్వాతే ఈ పథకాన్ని తీసుకువచ్చామని చెప్పారు. కేవలం రాజకీయ కారణాలతోనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టివి9 మీడియా గ్రూపు నిర్వహించిన ఓ సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ శనివారం మాట్లాడుతూసైనికుల నియామక ప్రక్రియలో ఈ పథకం విప్లవాత్మక మార్పులను తీసుకు వస్తుందని చెప్పారు.ఈ పథకం కింద రక్షణ దళాల్లో నియమితులయ్యే వారికి శిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు.దీని గురించి తప్పుడు అపోహలను కొంత మంది ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది కొత్త పథకం కాబట్టి కొందరిలో కొంత అయోమయం ఉండవచ్చన్నారు. దాదాపు రెండేళ్ల పాటు మాజీ సైనికులతో పాటు అందరితోను చర్చించిన తర్వాతే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు రాజ్‌నాథ్ చెప్పారు. ఏకాభిప్రాయంతోనే ఈ పథకాన్ని ప్రకటించినట్లు చెప్పారు. దేశం పట్ల ప్రజలకు క్రమశిక్షణా భావం, గౌరవభావం ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. రాజకీయ ఆలోచనలతో ఈ పథకంపై కొన్ని నిరసన కార్యక్రమాలు జరుగుతుండవచ్చని ఏ పార్టీ పేరును ప్రస్తావించకుండా అన్నారు. ఏ రాజకీయ పార్టీనైనా చెడుగా చూపించేందుకు అనేక అవకాశాలుంటాయని మంత్రి చెప్పారు. అయితే, మనం చేసే రాజకీయాలు ఏమైనప్పటికీ అవి దేశం కోసమేనని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ పార్టీలు చేసే రాజకీయం దేశం కోసమే అయి ఉండాలన్నారు. దేశంలోని సైనికుల ఆత్మస్థైర్యం దిగజారేలా చేద్దామా? అని ఆయన ప్రశ్నించారు. ఇది న్యాయం కాదన్నారు.

ఈ పథకం కింద నియమితులయ్యే వారికి రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారా మిలిటరీ దళాలు చేపట్టే నియామకాల్లో ప్రాధాన్యత లభిస్తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిపే నియామకాల్లోను వీరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అగ్నివీర్ అంటే రక్షణ దళాల్లోకి కొత్తవారిని తీసుకురావడం మాత్రమే కాదని, వారికి ప్రస్తుత సైనికులకు ఇచ్చే శిక్షణతో సమానమైన శిక్షణను అందిస్తామని చెప్పారు. శిక్షణ కాలం తక్కువ అయినప్పటికీ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీస్ పూరత్యిన తర్వాత ఇచ్చే రూ.11.71 లక్షల ఆర్థిక ప్యాకేజి గురించి రాజ్‌నాథ్ ప్రస్తావిస్తూ, వారు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయదలచుకుంటే అవసరమైన రుణం తక్కువ వడ్డీకి లభించేలా ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తుందన్నారు. నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత వీరికి ఉపాధి లభించేలా పథకాలను తమ ప్రభుత్వం రూపొందిస్త్తోందని రక్షణ మంత్రి చెప్పారు. దేశానికి ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి మన సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని తన ప్రసంగంలో రాజ్‌నాథ్ చెప్పారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా రక్షణ దళాల్లో నియమితులయ్యే వారిని అగ్నివీరులుగా పిలుస్తారు. సైనిక సిబ్బంది సగటు వయసును తగ్గించడం, జీతాలు, పింఛన్ల బిల్లులను తగ్గించుకోవడం ఈ పథకం ప్రధాన లక్షలనే విమర్శలు వస్తున్నాయి.సైన్యంలో చేరడం కోసం ఎంతో శ్రమకోర్చి శిక్షణ తీసుకుని రాతపరీక్షల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది యువకులు ఈ పథకం కారణంగా తమ అవకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళనలతో పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న విషయం తెలిసిందే.

Agneepath Scheme Out after wide ranging consultation:Rajnath

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News