Sunday, December 22, 2024

చివరి నిమిషంలో అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం వాయిదా

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) వేదికగా మంగళవారం ఉదయం చేపట్టాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని సైంటిస్టులు తెలిపారు.

8 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ప్రైవేట్‌ ప్రయోగ వేదిక నుంచి ఈరోజు ఉదయం 5.48 గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. చివరి నిమిషయంలో వాయిదా వేశారు. ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ ఈ రాకెట్‌ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఇప్పటికే 3సార్లు ఈ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News