- Advertisement -
న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ నియామకాలకు సంబంధించి ఇప్పటికే వాయుసేనలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 1 నుంచి నేవీ, ఆర్మీ లోనూ ఈ పథకం కింద నియామక ప్రక్రియ మొదలైంది. కాగా, అగ్నిపథ్‌లో భాగంగా నావికా దళంలో చేరడానికి దాదాపు 10 వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిసారిగా నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. ఆదివారం నాటికి 10 వేల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. జులై 15 నుంచి 30 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. అక్టోబరులో రాత పరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. నవంబరు నుంచి శిక్షణ ప్రారంభిస్తారు.
- Advertisement -