అనంతపురం: బలమైన పైప్ లైన్ మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రతక్ష, పరోక్ష ఉపాధిని సృష్టించడానికి స్థానికులతో కలసి పని చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామర్థాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో, ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఏజీ అండ్ పీ ప్రథమ్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి వచ్చే ఐదేళ్లలో అనంతపురం జిల్లాలో రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడులు జిల్లాలో 1000 మందికి పైగా ప్రజలకు ప్రతక్ష మరియు పరోక్ష ఉపాధిని కూడా అందిస్తాయి. భారతదేశ ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణంగా, మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహంతో సహజ వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఏజీ అండ్ పీ అవిశ్రాంతగా కృషి చేస్తోంది. ఈ మేరకు దేశీయ వినియెగదారులకు వాటశాలలకు సహజ వాయువును అందించడానికి, రవాణా రంగం కోసం సీ ఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్లకు సహజ వాయువుని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ లోని 4 జిల్లాలలో అంతటా గ్యాస్ పైప్ లైన్ నెట్ వర్కును ఈ జీ అండ్ పీ ప్రథమ్ ఈ జిల్లాలోని అనంతపురంలో ఎల్ సీ ఎన్ జీ ప్లాంటు ను ఏర్పాటు చేస్తోంది. అనంతపురం నగరానికి దేశీయ గ్యాస్, సీ ఎన్ జీ లను సమర్థంగా అందించేలా ఈ ప్లాంటు ఉంది. అనంతపురం ఎల్ సీ ఎన్ జీ నిర్మాణంలో అనంతపురం జిల్లా ప్రజలకు వారి ఇంధన బిల్లు ఖరీదు అయిన పెట్రోలు కంటే 50% తగ్గించడం, ఎల్ పీ జీ సిలిండర్ కంటే వంట ఇంధనంలో 20% ఆదా చేయడం సాధ్యమవుతాయి. దాంతోపాటు, పారిశ్రామీకరణను వేగవంతం చేసే, ఉద్యోగాలను సృష్టించే, కలుషాన్ని తగ్గించే, సుస్థిరమైన వాతావరణాన్ని పెంపొందించే సహజవాయువును అందించడం ద్వారా అనంతపురం జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. త్వదార పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఈ సందర్భంగా ఏజీఅండ్ పీ ప్రథమ్ అనంతపురం జిల్లా ప్రాంతీయాధిపతి గుమాలపల్లి వెంకటేశ్ మాట్లాడుతూ, “అనంతపురమును స్వచ్ఛమైన జిల్లా చేయడానికి ఏజీ అండ్ పీ ప్రథమ్ కృషిచేస్తోంది. ఇందుకోసం చావకయినా సహజవాయువును సులభంగా అందిస్తోంది. దింతో ఈ జిల్లా ప్రజలు తమ జీవితాలను మరింత సుఖంగా గడపగలరు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మరింత విస్తృతంగా అలోచించి, ఏజీ అండ్ పీ ప్రథమ్ అనంతపురంలో ఎల్ సీ ఎన్ జీ స్టేషన్ పెట్టాలని నిర్ణయించింది. పెట్రోలియం & నాచురల్ గ్యాస్ రేగులటరీ బోర్డు (పీఎన్ జీ ఆర్ బీ) సహజ వాయువు పైప్ లైన్ విషయం లో నిర్దేశించిన భద్రతా ప్రమాణాలతో సహా, అనేక డిమాండ్ సెంటర్లకు గ్యాస్ సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ ఎల్ సీ ఎన్ జీ స్టేషన్ స్థాపన, అన్ని సాంకేతిక పరిమాణాలు, స్పెసిఫికేషన్లుకు అనుగుణంగా ఉంది. అనంతపురం రూరల్ రాప్తాడు మండలం పరిధిలోకి వచ్చే ఎన్ యచ్ 44 జంక్షన్లో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వెనకబడిన ప్రాంతమైన జిల్లాలో పరిశ్రీమీకరణను వేగవంతం చేయడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి సుస్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి, త్వదార పౌరుల జీవన నాణ్యతను మెరుగుపర్చడానికి, సహజ వాయువుని అందించడం ద్వారా ఈ స్టేషన్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అన్నారు.
అనంతపురం వద్ద ఎల్ సీ ఎన్ జీ స్టేషన్ ఏర్పాటుకు అనేకమైన అనుమతులకొరకు అప్లై చేయడం జరిగింది. చట్టబద్దమైన, ప్రభుత్వ సంస్థలన్నీ ఏదేనా ఒక ప్రదేశంలో ఎల్ సీ ఎన్ జీ స్టేషన్ స్థాపించడం సురక్షితమే అని ద్రువీకరించికున్న తర్వాతే ఈ ఎల్ సీఎన్ జీ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మరియు పర్మిట్లను జారీ చేస్తాయన్న విషయాన్ని గమనించడం ముఖ్యం. కర్ణాటకలోని ‘సిరా’ నుంచి నాచురల్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా హిందూపురం కు తీసుకురావడానికి పనులు ప్రారంభించారు.
ఇంకా, ఏ జీ అండ్ పీ ప్రథమ్ ఉపయోగించే సామాగ్రి అంతా కేవలం ఏ జీ అండ్ పీ ప్రథమ్ రాష్ట్రంలో స్థానికులతో కలసి పైపెడ్ నాచురల్ గ్యాస్ మరియు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీ ఎన్ జీ) కి మారడం వాళ్ళ కలిగే ఆర్థిక, పర్యావరణపరమైన ప్రయెజనాల గురించి అవగాహన కల్పించేందుకు కృషిచేస్తోంది. ఏజీఅండ్ పీ ప్రథమ్ వారి కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీ ఎన్ జీ) నెట్ వర్కులు 2,78,000 చరుపు కిలోమీటర్లు మేర విస్తరించి 17,000 అంగుళాల పైప్ లైన్ 1,500 కొత్త సీ ఎన్ జీ స్టేషన్లను భారతదేశంలో కలిగి ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, శ్రీ సత్యసాయి, శ్రీ అన్నమయ్య, కడప జిల్లాలతో తమకున్న సుదీర్ఘ అనుబంధంపై ఏజీఅండ్ పీ గర్వపడుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రతిరోజూ అనంతపురం టౌన్, గుంతకల్లు, హిందూపురం, గుత్తి, అమ్మవారిపల్లి (కియా), కదిరిలో ఉన్న ఆరు సీ ఎన్ జీ స్టేషన్ల ద్వారా వెయ్యి కిలోల సహజ వాయివును అందిస్తోంది. తొలి దశ అభివృద్ధిలో భాగంగా అనంతపురం టౌన్, హిందూపురం, పుట్టపర్తి పట్టణాలలో ఇళ్లకు పీ ఎన్ జీ సరఫరా చేయాలనీ కంపెనీ భావిస్తోంది. కేవలం రెండు నెలల్లోనే 8000 -9000 పీ ఎన్ జీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. కడప పుట్టంపల్లి, హిందూపురంలోని తూమకుంట, కియా మోటార్స్ లోని పారిశ్రామిక పార్కులకు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ ఏర్పాటుతో పరిశ్రమలు స్వచ్ఛ ఇంధనాన్ని ఉపయోగించడంతో పటు అదనపు నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవచ్చు. దీనివల్ల మరిన్ని పారిశ్రామిక పార్కులు వచ్చి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
స్థానికులకు మరో ప్రతక్ష ప్రయోజనం సాలిగించేందుకు ఏజీ అండ్ పీ ప్రథమ్ ఈ ప్రాంతంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటుచేస్తోంది. దీనివల్ల 1000 మందికి పైగా ప్రతక్షంగా, పరోక్షముగా ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రతక్ష వాటాదారులకు మరిన్ని ఉపాధి, అభివృద్ధి అవకాశాలు దక్కుతాయి.2030 నాటికీ దేశంలో వాడే ఇంధనాల్లో సహజ వాయువు వాటాని 15%కు పెంచాలన్న భారత ప్రభుత్వ దార్శనికతతో భాగంగా ఏజీ అండ్ పీ ప్రథమ్ తన సీజీడీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తోంది. ఈ పరిశుభ్రమైన, హరిత ఇంధనం ప్రజల ప్రయెజనం కోసం త్వరితగతిన అందుబాటులో ఉండేలా చూస్తుంది.
AG&P Pratham Invest rs 400 cr in Anantapur