Friday, November 22, 2024

లిక్విఫైడ్‌, కంప్రెస్డ్‌ ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను ప్రారంభించిన ఏజీ, పీ ప్రథమ్‌

- Advertisement -
- Advertisement -

భారతీయ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) పరిశ్రమలో అగ్రగామి సంస్ధలలో ఒకటైన ఏజీ & పీ ప్రథమ్‌, ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి లిక్విఫైడ్‌ కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌సీఎన్‌జీ) స్టేషన్‌ను వైఎస్‌ఆర్‌ జిల్లా కడపలోని ఏపీఐఐసీ పారిశ్రామిక పార్క్‌ వద్ద ప్రారంభించింది. ఈ ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా షేక్‌ బెపారీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్‌ సభ్యులు వై ఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఏజీ & పీ ప్రథమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అభిలేష్‌ గుప్తా, ఏజీ & పీ ప్రథమ్‌ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ పాల్గొంది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా షేక్‌ బెపారీ మాట్లాడుతూ.. సంప్రదాయం ఇంధన వనరుల లాంటి పెట్రోల్ డీజల్‌తో పోలిస్తే CNGలో ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. ఈ సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణహితమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ లో సృష్టించడం జరుగుతుంది. ఈ సహజ వాయువు వినియోగం కారణంగా వాహనాలు, పరిశ్రమలు విడుదల చేసే గాలి కాలుష్యం తగ్గించడం సాధ్యమవుతుంది. భారతదేశానికి తగినంత ఇంధన నిల్వలతో దేశం ముందుకు వెళ్లేందుకు సైతం తోడ్పడుతుంది’’ అని అన్నారు.
ఈ రంగంలో AG&P లాంటి సంస్థలు రాష్ట్రంలో CNG, పరిశ్రమలు, వాణిజ్య, గృహ విభాగాల కోసం సహజవాయువు అందించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వేగ వంతం చేసేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తుంది అని అన్నారు.

కడప పార్లమెంట్‌ సభ్యులు వై ఎస్‌ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పర్యావరణ అనుకూలం కావడంతో పాటుగా ఎలాంటి హానికరమైన ఉద్గారాలను విడుదల చేయని కారణంగా సహజ వాయువును హరిత ఇంధనంగా భావిస్తుంటారు. ఈ నూతన స్టేషన్‌ ప్రారంభంతో, కడప వాసులు, చుట్టు పక్కల ప్రాంతాల నివాసితులకు హరిత ఇంధనం అందుబాటులోకి వస్తుంది. దీనితో పాటుగా స్వచ్ఛమైన, హరిత పర్యావరణ వ్యవస్థ కు సంబంధించి స్థానిక మౌలిక వసతులు సైతం బలోపేతం అవుతాయి.

ఈ ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ ద్వారా ఏపీహెబ్‌బీ కాలనీ, ప్రకాష్‌ నగర్‌, శంకరపురం, పక్కిరాపల్లి, అర్వింద్‌ నగర్‌, రెడ్డి కాలనీ, భాగ్యనగర్‌ కాలనీ, NGO కాలనీ, యెర్రముక్కపల్లి, మారుతినగర్‌, సైనిక్‌ నగర్‌, రామాంజనేయ పురం, తిలక్‌ నగర్‌, వైఎస్‌ఆర్‌ నగర్‌, టెలికామ్‌ నగర్‌, విద్యుత్‌ నగర్‌, ఆర్‌ కె నగర్‌, ఆర్‌టీసీ కాలనీలు సహజవాయువు పొందగలవు’’ అని అన్నారు.

ఈ ప్రారంభం సందర్భంగా ఏజీ & పీ ప్రథమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌–సీఈఓ అభిలేష్‌ గుప్తా మాట్లాడుతూ.. ‘‘ఈ మొట్టమొదటి ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అత్యంత సహజసిద్ధమైన వాయువును ప్రత్యామ్నాయ ఇంధనంగా గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య, రవాణా విభాగాలలో స్వీకరించగలదనే నిబద్ధతను చాటి చెబుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం, స్ధానిక అధికారులు అందిస్తున్న నిరంతర సహకారం పట్ల ఏజీ& పీ ప్రథమ్‌ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

ఏపీలో సీఎన్‌జీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, స్వచ్ఛ ఇంధన వనరులు ప్రోత్సహించడంలో భాగంగా ఏజీ & పీ ప్రథమ్‌కు ప్రభుత్వం సహాయపడుతుందన్నారు. రాష్ట్రంలో స్ధిరంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తుండటం ద్వారా ఏజీ & పీ ప్రథమ్‌ ఇప్పుడు 300కు పైగా సీఎన్‌జీ స్టేషన్‌లు అభివృద్ధి చేసి 26 లక్షల గృహాలు, 10వేలకు పైగా వాణిజ్య సముదాయాలు, 150కు పైగా పరిశ్రమలకు మద్దతు అందించడంతో పాటుగా 7వేలకు పైగా ఉద్యోగాలను రాబోయే ఎనిమిది సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌లో అందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

రోజుకు 100 టన్నుల సహజవాయువును సరఫరా సామర్ధ్యంతో కడప ఎల్‌ సీఎన్‌జీ స్టేషన్‌, వైఎస్‌ఆర్‌ అన్నమయ్య జిల్లాల అవసరాలను తీర్చగలదు. దాదాపు 150 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ను వైఎస్‌ఆర్‌ జిల్లా కడప పట్టణంలో 2023 ఆర్ధిక సంవత్సరాంతానికి అభివృద్ధి చేయనున్నాము. ఈ నూతన స్టేషన్‌తో 4000 గృహాలు, 3 పరిశ్రమలు, 10 వాణిజ్య కేంద్రాలు మార్చి 2023 నాటికి కడప వ్యాప్తంగా ప్రయోజనం పొందగలవు’’ అని అన్నారు.

ఏజీ & పీ ప్రథమ్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జిల్లాల్లో తమ సీజీడీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తుంది. వీటిలో సాయి బాలాజీ, చిత్తూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీ సత్య సాయి, అనంతపూర్‌ ఉన్నాయి. నేటికి, ఏజీ & పీ ప్రథమ్‌ 21 సీఎన్‌జీ స్టేషన్‌లను అనంతపూర్‌, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య మరియు శ్రీ సత్య సాయి జిల్లాల్లో, 15 స్టేషన్‌లను ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు మరియు శ్రీ బాలాజీ జిల్లాలు, చిత్తూరు జిల్లాలో 9 స్టేషన్‌లు ఉన్నాయి. ఈ కంపెనీ మరో 7 సీఎన్‌జీ స్టేషన్‌లను మార్చి 2023 నాటికి రాష్ట్రంలో ప్రారంభించడానికి ప్రణాళిక చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఓజిలి, తిరుపతి జిల్లా మరియు రాప్తాడు గ్రామం, అనంతపురం జిల్లాల్లో మరో రెండు ఎల్‌సీఎన్‌జీ కేంద్రాలను ఏజీ & పీ ప్రథమ్‌ ప్రారంభించడానికి ప్రణాళిక చేసింది. ఈ కంపెనీ ఈ తరహా సదుపాయాలను జోధ్‌పూర్‌, నంజన్‌ గుడ్‌, వెల్లూరు, మైసూరు, అలపుజ్జ, తిరువనంతపురం, కాంచిపురం, రాయ్‌చూర్‌లలో నిర్వహిస్తుంది. కడప ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ ఏజీ& పీ ప్రథమ్‌కు దేశంలో 9వ ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌. మరో 8 ఎల్‌సీఎన్‌జీ కేంద్రాలను దేశవ్యాప్తంగా ప్రారంభించనుంది.

సాంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్ డీజల్ తో పోలిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్న CNG వినియోగాన్ని ప్రోత్సహించేందుకు AGP Pratham నిరంతరాయంగా ప్రయత్నిస్తోంది. ఈ సహజ వాయువు వినియోగం వాహన యజమానులకు ఆకర్షణీయమైన ఆర్థిక ప్రయోజనాలే కాకుండా అత్యంత సురక్షితమైనదిగా కూడా ఆదరణ పొందింది. సహజ వాయువు కారణంగా వాహనాలు, పరిశ్రమలు వెద జల్లే గాలి కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. బాధ్యతా యుతమైన వృద్ధి, తగిన ఇంధన నిల్వలు కలిగిన దేశంగా ముందుకు వెళ్లడంలో సహాయపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News