Sunday, December 22, 2024

చిత్తూరులో 14వ CNG ఇంధన కేంద్రాన్ని ప్రారంభించిన ఏజి అండ్ పి ప్రథమ్

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: భారతదేశంలోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) రంగంలో అగ్రగామిగా ఉన్న ఏజి&పి ప్రథమ్ చిత్తూరు జిల్లాలో 14వ CNG స్టేషన్‌కు తన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) నెట్‌వర్క్‌ను విస్తరించిన్నట్లు ప్రకటించింది. చిత్తూరు జిల్లాలోని ప్రధాన నగరమైన పలమనేరులోని DBS (డాటర్ బూస్టర్ స్టేషన్)గా ప్రారంభించబడిన ఈ స్టేషన్ లో 3-వీలర్లు, కార్గోస్, కార్లు, మినీ కమర్షియల్ వెహికల్స్ (MCV), లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCV), బస్సులకు, అన్ని రకాలు వాహనాలకు ఏజి&పి ప్రథమ్ తమ CNG నిరంతరాయంగా సరఫరాను అందించడానికి నిబద్ధతతో పనిచేస్తుంది.

ఏజి&పి ప్రథమ్ పలమనేరులోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL-Sri Venkateswara Service Station, LB Nagar) ఆవరణలో ఉన్న తమ 14వ CNG స్టేషన్ను గంగా నిరంజన్ రెడ్డి- DTC, చిత్తూరు జిల్లా, మదుసూధన్- RTO ఇన్‌స్పెక్టర్ – పలమనేరు వారిచే ప్రారంభించడం జరిగినది. పలమనేరు పట్టణ నివాసితులు, ప్రయాణీకులకు CNG లభించును, ఈ పట్టణంగుండ 40వ జాతీయ రహదారిపై చెన్నై, బెంగళూరు, తిరుపతి మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు ప్రయాణించే ప్రయాణీకులు కుడా CNG ని వినియోగించుకోగలరు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, చిత్తూరు, వి-కోట, కుప్పం, పుంగనూరు, మదనపల్లె స్టేషన్‌లతో పాటు ఏజి&పి ప్రథమ్ తన CNG సేవలను పలమనేరుకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏజి&పి ప్రథమ్ కంపెనీకి మొత్తం 51 స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి.

ఏజి&పి ప్రథమ్ రీజినల్ హెడ్ చిరాగ్ కె భన్వాడియా మాట్లాడుతూ.. “దేశం యొక్క కీలకమైన గ్రీన్ ఎనర్జీ వినియోగానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అంతటా మా సహజ వాయువు పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించడంపై మేము దృష్టి సారించాము. ఏజి&పి ప్రథమ్ అందించే CNG సేవలు ఆటోలు, కార్లు, చిన్న వాణిజ్య వాహనాలు, ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులతో సహా అనేక రకాల వాహనాలకు అందుతాయి. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో కొత్తగా ప్రారంభించబడిన CNG స్టేషన్ ద్వారా పరిశుభ్రమైన మరింత స్థిరమైన CNG ని అందించడానికి ఏజి&పి ప్రథమ్ యొక్క నిబద్ధతకు అనుగుణంగా, ప్రైవేట్, పబ్లిక్ రవాణా రెండింటికీ పర్యావరణ అనుకూల ఇంధన ప్రత్యామ్న్యాయాన్ని అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్న్యాయ ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించిoది, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ సహకారంతో CNGని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది, హరిత భవిష్యత్ దిశగా భారతదేశం యొక్క పరివర్తనకు దోహదం చేస్తుంది” అని అన్నారు.

CNG శక్తితో నడిచే వాహనాలను వినియోగించడం వలన వాహన కాలుష్యం నివారించవచ్చు, వాహన యజమానులకు ఇంధన ఖర్చుల పరంగా ఆదా అవుతుంది, ఇంధన ఖర్చులు 45% వరకు తగ్గుతాయి. ఇంకా, వాహనాలు ఇంజన్లు ఎక్కువ కాలం పాటు సమర్ధవంతంగా పనిచేస్తాయి , ఇది అధిక మైలేజీకి తోడ్పడటంతో పాటుగా నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. అంతేకాకుండా, వాహనాల్లో CNGని ఉపయోగించడం వలన తక్కువ కాలుష్యం, సురక్షితమైన రవాణా కోసం CNG శక్తితో నడిచే వాహనాలను వినియోగించడం పర్యావరణ అనుకూలకతకు దోహదం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News