Monday, December 23, 2024

భార్యను తుపాకీతో కాల్చి చంపిన సిఆర్‌పిఎఫ్ జవాన్

- Advertisement -
- Advertisement -

లక్నో: మాజీ సిఆర్‌పిఎఫ్ జవాన్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నీతా రాథోర్, మహేంద్ర సింగ్ అనే దంపతులు ఉన్నారు. మహేంద్ర సింగ్ గతంలో సిఆర్‌పిఎఫ్‌లో జవాన్‌గా పని చేసి పదవి వీరమణ పొందారు. ప్రస్తుతం అతడు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సింగ్ భార్య అతడిని పలుమార్లు కించపరిచినట్లుగా మాట్లాడింది.

అతడు కూడా పలుమార్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భార్య బాత్రూమ్‌లో బట్టలు ఉతుకుతుండగా ఇద్దరు మధ్య గొడవ జరిగింది. తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీ తీసుకొని ఆమెపై కాల్పులు జరిపారు. అదే సమయంలో ఆమె కోడలు ఇంట్లో ఉండడంతో స్థానిక ఆసత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి మహేంద్ర సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News