Thursday, January 23, 2025

కోడలిని చంపిన మామ

- Advertisement -
- Advertisement -

లక్నో: కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో చిన్న కోడలను భర్త నరికి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రఘవీర్ సింగ్ అనే కుటుంబం కిరవాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. రఘు వీర్‌కు గౌరవ్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. గౌరవ్ సింగ్ ఫరూఖ్‌బాద్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రఘువీర్ పెద్ద కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబంతోనే పెద్ద కోడలు ఉంటుంది. గత కొన్ని రోజులు ఇద్దరు కోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరు కోడళ్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో చిన్న కోడలును మామా రఘువీర్ నరికి చంపాడు. ఈ సంఘటన జరిగినప్పుడు చిన్న కుమారుడు విధుల్లో ఉన్నాడు. రఘువీర్ వెంటనే వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరుడిని కాపాడిన మహిళ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News