Friday, September 20, 2024

జిహెచ్‌ఎంసిలో కంటోన్మెంట్ విలీనం వాదనతో ఏకీభవిస్తున్నా

- Advertisement -
- Advertisement -

Agree with argument that Cantonment should be merged into GHMC: KTR

మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ణు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. కంటోన్మెంట్‌ను జిహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తాను కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నానన్న కెటిఆర్.. మిగతా వారు ఏమంటారని ప్రజలను ప్రశ్నిస్తూ కెటిఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కెటిఆర్ ట్వీట్లకు నెటిజన్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కంటోన్మెంట్‌ను జిహెచ్‌ఎంసిలో విలీనం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. కొందరు కంటోన్మెంట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ ట్వీట్ చేశారు. బ్రిటిష్ పరిపాలనను గుర్తుకు తెస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలతో దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రాఫిక్ సమస్య, అభివృద్ధికి ఏకైక పరిష్కారం కంటోన్మెంట్ బోర్డును జిహెచ్‌ఎంసీలో కలపడమే అంటూ చాలా మంది ట్వీట్ చేశారు. అయితే, మరికొందరు మాత్రం ఇది అంతా ఈజీ కాదంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు కేంద్ర రక్షణశాఖ పరిధిలో ఉంటుంది. దానిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. మరి ఇది అయ్యే పనేనా అంటూ మరికొందరు ప్రశ్నించారు. కొందరు నెటిజన్లు జిహెచ్‌ఎంసి చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్లను కూడా గ్రేటర్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ సమస్య ఈ నాటిది కాదు. ఇక్కడి లోకల్ మిలిటరీ అథారిటీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఇష్టం వచ్చినట్లుగా రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ తిరిగి ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితి. కరోనా టైమ్‌లో అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైన నాలుగు రోడ్లను మూసివేశారు. ఈ సమస్యను ప్రస్తావిస్తూ గతంలో మంత్రి కెటిఆర్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ కూడా రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News