Wednesday, January 22, 2025

మోడీ మాటలతో ఏకీభవిస్తున్నా: డీకే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : శనివారం ఉదయం బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు , కర్ణాటక సిఎం, డిప్యూటీ సిఎం ఇద్దరిలో ఎవరూ హాజరు కాలేదు. మోడీ ఉద్దేశపూర్వకంగానే వారిని ఎయిర్‌పోర్టుకు రావొద్దన్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అందుకు ప్రధాని నరేంద్రమోడీనే స్వయంగా స్పష్టత ఇచ్చారు. బెంగళూరుకు నేను ఏ సమయంలో చేరుకుంటానో కచ్చితంగా తెలీదు. అందుకే ప్రొటోకాల్ విషయంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. అందుకే వారిని రావొద్దని చెప్పాను. ’ అని మోడీ వెల్లడించారు.

ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రధాని చెప్పినదాంతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రోటోకాల్ ప్రకారం సీఎం, నేను ప్రధానిని ఆహ్వానించేందుకు వెళ్దామని అనుకున్నాం. కానీ ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన సమాచారాన్ని మేం గౌరవించాలనుకున్నాం. పొలిటికల్ గేమ్ ఇప్పటికే ముగిసింది. ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించాం. ’ అని శివకుమార్ అన్నారు. ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపి , కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. దానిని ఉద్దేశించే పొలిటికల్ గేమ్ అని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News