Sunday, December 22, 2024

ఉక్రెయిన్ ఉద్రిక్తత తగ్గించడానికి రష్యా, ఫ్రాన్స్ మధ్య అంగీకారం

- Advertisement -
- Advertisement -

Agreement between Russia and France to reduce tension in Ukraine

పుతిన్, బైడెన్ మధ్య త్వరలో చర్చలు

పారిస్ : తూర్పు ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ మధ్య ఆదివారం అంగీకారం కుదిరింది. ఉభయనేతలు ఈ సంక్షోభం పరిష్కార దిశలో భాగంగా 105 నిమిషాల పాటు ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రస్తుత సంక్షోభం నివారణకు దౌత్యపరంగా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటు మేక్రాన్ కార్యాలయం ప్రకటించింది. రానున్న రోజుల్లో రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు సమావేశమవుతారు. ఉక్రెయిన్ యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించడానికి , యుద్ధాన్ని నివారించడానికి ఉపయోగపడుతుందనుకుంటే ఏ సమయం లోనైనా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకోడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇష్టపడ్డారని ఆయన ఉన్నత దౌత్యప్రతినిధి ఆదివారం వెల్లడించారు. అమెరికా చాలావేగంగా ఈ చర్చలు సాగిస్తుందని, తాము చూస్తున్న ప్రతీదీ చాలా తీవ్రమైన అంశమని తాము దండయాత్ర అంచున ఉన్నామని అమెరికా సహాయ మంత్రి ఆంటోనీ బ్లింకన్ ఒక వార్తా సంస్థతో చెప్పారు. యుద్ధ టాంకులు సాగుతున్నంతవరకు , విమానాలు ఎగురుతున్నంత వరకు ప్రతి అవకాశాన్ని, ప్రతినిముషాన్ని దౌద్యపరమైన పరిష్కారం కోసం వినియోగించుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News