Sunday, January 19, 2025

పల్లెపల్లెల్లో పరపతి కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల బహుళార్థక వ్యవసాయ పరపతి కేంద్రాలు (పిఎసిఎస్) ఏర్పాటు చేసే నిర్ణయానికి కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పటిష్టవంతమైన పాల, మత్స సహకార సంఘాలను వచ్చే ఐదేళ్లలో ఏర్పాటు చేసేందుకు దీనితో వీలేర్పడుతుందని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. దేశంలో సహకార రంగాన్ని అట్టడుగు స్థాయిలోకి విస్తరింపచేయడం, ఇదే క్రమంలో దీని పటిష్టతకు చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 13 కోట్ల మంది రైతులు ప్రాధమిక సహకార సంఘాలతో వివిధ స్థాయిల్లో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు.

ఈ సొసైటీల పరిధిలో వివిధ పథకాలను మరింత వేగవంతంగా అమలు చేసేందుకు వీలేర్పడుతుంది. ప్రభుత్వ సంపూర్ణ ప్రమేయం కల్పించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. దేశంలో ఇప్పుడు 63000 పిఎసిలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకూ పిఎసిలు లేని ప్రతి పంచాయతీలో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు అవుతాయి. ప్రత్యేకించి పాడి, మత్స పరిశ్రమపైనే దృష్టి సారిస్తారు. సహకార సంఘాలలోని రైతులకు ఎప్పటికప్పుడు తగు సమాచారం అందించడం ద్వారా వారి ఆదాయ వనరులు పెరిగేలా చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా సంబంధిత రంగాలలో పెట్టుబడుల విస్తరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు.
రూ 4800 కోట్ల వైబ్రెంట్ విలేజ్ పథకం
గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలస నివారణ కు ఉద్ధేశించి కేంద్ర ప్రభుత్వం రూ 480ం కోట్ల వెబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ మేరకు నిర్ణయం జరిగింది. గ్రామాల చైతన్యస్ఫూర్తి దిశలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. నాలుగు రాష్ట్రా లు, సరిహద్దు ప్రాంతంలోని కేంద్ర పాలిత ప్రాంతంలోని 19 జిల్లాలకు ఈ కార్యక్రమాన్ని వర్తింపచేస్తారని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇప్పటి సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఈ కొత్త పథకాన్ని అమలులోకి తీసుకువస్తారు.

ఇప్పటి నుంచి 202526 ఆర్థిక సంవత్సరం వరకూ వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాలలో ఈ మేరకు ఈ కేటాయింపులు ఉం టాయని మంత్రి తెలిపారు. ప్రజలు తమ గ్రామీణ ప్రాంతాలను వీడకుండా చేసేందుకు, వలసల నివారణ కు ఈ పథకం తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పథకాన్ని హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లద్థాఖ్‌లలో అమలు చేస్తారని ప్రభుత్వం తెలిపింది. వాతావరణాలకు తట్టుకునే రహదారులు, తాగునీరు, సౌర, వాయు విద్యుత్ కల్పనతో 24 గంటల కరెంటు, మొబైల్, ఇంటర్నెట్ అనుసంధానం, పర్యాటక కేంద్రాలు, బహుళార్థక కేంద్రాలు, ఆరోగ్య స్వస్థత సెంటర్ల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు.
ఐటిబిటికి అదనంగా 90వేల సిబ్బంది
సరిహద్దుల భద్రతను పరిగణనలోకి తీసుకుని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటిబిటి)లో మరో ఏడు కొత్త బెటాలియన్ల ఏర్పాటు సంబంధిత నిర్ణయానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనితో ఐటిబిటిలోకి కొత్తగా మరో 9400 మంది జవాన్లు చేరుతారు. 1962 లో చైనా దురాక్రమణ తరువాతి దశలో ఐటిబిపి ఏర్పాటు అయింది. ఇప్పుడడు దాదాపు 90000 మంది సిబ్బందితో ఉంది. సరిహద్దులలో ప్రత్యేకించి చైనా వెంబడి భద్రత విషయంలో ఐటిబిటి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ బలగాల సంఖ్య మరింతగా పెరిగేందుకు ఈ కొత్త బెటాలియన్ల సంఖ్య పెంచడం జరుగుతుంది. దీనికి తోడుగా ఈ దళాల పర్యవేక్షణకు 202526 నాటికి ఐటిబిటికి అదనపు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News