మన తెలంగాణ/మక్తల్ : 70 వేల ఎకరాల కు నీరు అం దిం చే సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బండను తొలగించి, 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నా రాయణపేట జిల్లా, మక్తల్ మండల పరిధిలో ని సంగంబండలో ఏర్పాటు చేసి న ప్రజాదీవెన సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి మాట్లాడుతూ… దివంగత నేత మాజీ సిఎం వై స్ రాజశేఖర్ రెడ్డి హయాం లోముందుచూపుతోనే ఉమ్మడి రాష్ట్రంలో జలయ జ్ఞం కార్యక్రమాన్ని నాటి కాంగ్రెస్ ప్రభు త్వం చేపట్టిందన్నారు. అందు లో భాగంగానే సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బండ పగిలి గలగల నీరు పా రుతుంటే అంతకంటే ఆనం దం ఏముంటుందని అన్నా రు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే.. గత పదేళ్ల కాలంలో ఏ ఒక్కటీ పూర్తి కాలేదన్నారు. పైన రిజర్వాయర్, కింద కాలువలు పూర్తయిన ఒక బండ పగలగొట్ట లేకపోయిన చరిత్ర గత ప్రభుత్వానిదని అన్నారు.
వారి నిర్లక్షం మూలంగా నీళ్లు లేక పదేళ్ల పాటు ఈ ప్రాంత రైతులు పంటలను ఎండబెట్టుకోవాల్సి
భాగంగానే సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బండ పగిలి గలగల నీరు పారుతుంటే అంతకంటే ఆనందం ఏముంటుందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే.. గత పదేళ్ల కాలంలో ఏ ఒక్కటీ పూర్తి కాలేదన్నారు. పైన రిజర్వాయర్, కింద కాలువలు పూర్తయిన ఒక బండ పగలగొట్ట లేకపోయిన చరిత్ర గత ప్రభుత్వానిదని అన్నారు. వారి నిర్లక్షం మూలంగా నీళ్లు లేక పదేళ్ల పాటు ఈ ప్రాంత రైతులు పంటలను ఎండబెట్టుకోవాల్సి వచ్చిందన్నారు.సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షునిగా, ఎంఎల్‌ఎగా, మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి కృష్ణా, గోదావరి జలాలను మళ్లించే శక్తి సామర్థాలను ఆలోచన కలిగిన నాయకుడన్నారు. పాలమూరు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ ప్రాంతంపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. పాలమూరు సమస్యలు తెలిసే జూరాల నుంచి కొడంగల్, నారాయణపేట ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీళ్లు మళ్లించే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.
ఎంఎల్‌ఎ వాకిటి శ్రీహరి నిరంతరం మంత్రులను కలుస్తూ మక్తల్ సమస్యలను నెరవేరుస్తూ నిధులను తీసుకువస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. కొండలు, రాళ్లు, రోడ్లకు, భూస్వాములకు కాకుండా సాగు చేసుకుంటున్న నిరుపేదలకు రైతు భరోసా అందాలనేదే తమ ప్రభుత్వ లక్షమన్నారు. అందుకే మొదట ఒక్క ఎకరంతో మొదలుపెట్టి 3 ఎకరాల వరకు రైతులకు నగదు జమ చేశామని, తాజాగా 4 ఎకరాల రైతులకు డబ్బులు వేయడం మొదలుపెట్టామని, త్వరలోనే మిగిలిన రైతులందరికీ నగదు జమ చేస్తామన్నారు.
అర్హత కలిగిన నిరుపేదలు 200ల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే బిల్లు కట్టాల్సిన పని లేదన్నారు. ఎవరైనా లబ్ధ్దిదారుల పేర్లు పొరపాటున లిస్టులో రాకపోయినా బిల్లు కట్టాల్సిన పనిలేదని, వారిని ఒత్తిడి చేయవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పినట్టు భట్టి భరోసా ఇచ్చారు. లిస్టులో రాని అర్హులు ఎంపిడిఓ కార్యాలయానికి వెళ్లి మీ కరెంట్ బిల్లు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అందించి జీరో బిల్లు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని… చేసేదే చెబుతుందన్నారు.
భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు ఎంపి అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వంశీచందర్‌రెడ్డిని ప్రకటించిందని, వంశీని గెలిపించండి మీకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. వంశీచందర్ రెడ్డి విద్యార్థ్ధి యువజన నాయకుకడిగా ఎదిగారని తెలిపారు. వంశీ గెలవక ముందే వందల కోట్ల నిధులు పాలమూరుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని,. గెలిచాక ఏ ఎంపి చేయని విధంగా వంశీ పనిచేస్తాడన్న పూర్తి నమ్మకం తనకుందని డిప్యూటీ సిఎం తెలిపారు. కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి పిసిపి చైర్మన్ కల్లుగీత డిపార్ట్‌మెంట్ కేశం నాగరాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.