Monday, December 23, 2024

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రొ ఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ రెండున వ్యవసాయ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలతో మేదో మదన కార్యక్రమం నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం ద్వారా రాబోయే తరాల వారికి ఆహార భద్రత కలిగించటం కోసం జీవ వైరుధ్యమైన జన్యులపై పరిశోధనలు, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించడం వంటి అంశాలపైన ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం , ఐసిఏఆర్ సంస్థల శాస్త్రవేత్తలు , విద్యార్థులు పాల్గొంటారని విశ్వవిద్యాలయం అధికారి డా.సుధాకర్ రావు ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News